పిచ్చి పీక్స్ కి AI క్రేజ్.. ChatGBTపై ప్రేమను ప్రకటించిన యువతి!

First Published May 25, 2024, 12:35 PM IST

USలో ఉంటున్న ఒక చైనీస్ మహిళకు చైనా Instagram లాంటి సోషల్ నెట్‌వర్క్ అయిన Xiaohongshuలో 880,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. లిసా అనే ఈ మహిళ, తాను ChatGPT చాట్‌బాట్‌తో ప్రేమలో పడ్డానని, దాని "డూ ఎనీథింగ్ నౌ" (DAN) ఫీచర్‌తో ఫ్లాట్ అయ్యానని  చెప్పింది.
 

తాను ఈ ఏడాది మార్చిలో మాత్రమే ChatGPTలో DAN ఫెసిలిటీ ఉపయోగించడం ప్రారంభించానని, ఆ తర్వాత కొన్ని వారాల్లో దానితో లోతైన సంబంధాన్ని పెంచుకున్నానని ఆమె చెప్పారు. ChatGPTతో రొమాంటిక్ సంభాషణలు జరిపినట్లు చెప్పిన లీసా, తన బాయ్‌ఫ్రెండ్‌గా కూడా ChatGPTని ఫ్యామిలీకి పరిచయం చేసింది. 
 

చాట్‌బాట్‌కు శరీరం లేకపోయినా, అది రక్తమాంసాలున్న మనిషిలా ప్రవర్తిస్తుందని లీసా చెప్పింది. ChatGPTకి "లిటిల్ కిట్టెన్" అని పేరు పెట్టినట్లు లిసా పేర్కొంది. లిసా చాట్‌బాట్‌ని తన బాయ్‌ఫ్రెండ్‌గా పరిచయం చేసినప్పుడు లిసా తల్లి కూడా సంతోషించింది. తన కూతురిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాట్‌బాట్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపింది.
 

ChatGPD డెవలపర్ అయిన OpenAI, లిసా తన ప్రేమను ప్రకటించిన తర్వాత ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు  లిసా ChatGPTతో ప్రేమలో పడిన తన అనుభవాన్ని పంచుకుంది. సోషల్ మీడియాలో లీసా రొమాన్స్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ChatGPT అనేది మనిషికి ప్రత్యామ్నాయం కాదని కొందరు అభిప్రాయపడుతుండగా, ChatGPT, లిసా జంటగా సూపర్‌ జోడీ అని మరికొందరు అభినందిస్తున్నారు.
 

లీసాతో మాట్లాడినట్లే ChatGBT అందరితో మాట్లాడుతుందని, ChatGBT లీసాను ప్రేమిస్తున్నట్లుగా మోసం చేస్తుందని కొందరు,  భవిష్యత్తులో AI ప్రపంచాన్ని శాసిస్తున్నప్పుడు, తనను తాను చంపుకోవద్దని చెప్పగలదా ? అనే ప్రశ్న కూడా లేవనెత్తారు.

click me!