సమ్మర్లో ఏసీ ఆన్ చేస్తున్నారా.. ఇలా చేయడం మర్చిపోకండి.. లేదంటే..

First Published | Apr 9, 2024, 1:32 PM IST

సమ్మర్లో  ఎయిర్ కండీషనర్ ఆన్ చేసే ముందు మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా చేయకపోవడం వల్ల మీరు తరువాత తీవ్రంగా బాధపడవచ్చు.
 

ఎప్పటిలాగే సమ్మర్  సీజన్ వచ్చేసింది. ఎండలు రోజురోజుకి హీటెక్కిపోతున్నాయి. మీ  ఇంట్లో AC నెలల తరబడి ఆఫ్ చేసి ఉంటే మీ తప్పు కారణంగా అది పాడైపోవచ్చు. వేసవి వచ్చిందంటే చాలా మంది వేడిని తట్టుకోలేక ఇంట్లోకి రాగానే  ఏసీ ఆన్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మానుకోండి.
 

వేసవిలో ఏసీ ఆన్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల వేసవిలో నిరంతరం చల్లటి గాలి అందడమే కాకుండా రెగ్యులర్ గా సర్వీసింగ్ చేస్తే ఏసీ లైఫ్ టైం  పెరుగుతుంది.
 


 మీరు సర్వీసింగ్ చేయకుండా  ఏసీని నడుపుతూ వదిలేస్తే, మీ AC గదిని చల్లబరచడానికి సమయం పడుతుంది, దీన్ని వల్ల మీ కరెంట్ వినియోగం   పెరుగుతుంది ఇంకా కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంది.
 

ఏసీ సర్వీసింగ్ చేపించడం ఎంత ముఖ్యమో, ఎయిర్ కండీషనర్‌లోని గ్యాస్‌ను చెక్  చేయడం కూడా అంతే ముఖ్యం. వేసవి వచ్చిందంటే  AC గ్యాస్ చెక్ చేసుకోకుండా ఏసీ ఆన్ చేయకండి.

గంటల తరబడి ఏసీ ఆన్ చేసి పెట్టిన చల్లగాలి అందని పరిస్థితి ఇంకా  కూలింగ్  తక్కువగా ఉంటే కంప్రెసర్ ప్రెజర్ పెరుగుతుందని, తద్వారా  కంప్రెసర్ దెబ్బతింటుందని నిపుణులు చెపుతున్నారు.
 

Latest Videos

click me!