కొత్త ఫోన్ కోనాలనుకుంటుంన్నారా.. అయితే ఏప్రిల్ లో లాంచ్ కానున్న 5జి ఫోన్స్ ఇవే..

First Published | Apr 1, 2024, 2:28 PM IST

చాల మంది ఇప్పటికే 5జి ఫోన్లకు అప్ గ్రేడ్ అవుతున్నారు. అలాగే మరికొందరు పాత ఫోన్ వదిలేసి కొత్త ఫోన్  కొనేందుకు ఆలోచిస్తుంటారు. అయితే మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఇవి కూడా కావల్సిన ఫీచర్లను అందిస్తున్నాయి. మీరు కూడా కొత్త ఫోన్ కొనేందుకు ఆలోచిస్తున్నట్లయితే ఏప్రిల్ నెలలో రానున్న స్మార్ట్  ఫోన్  పై ఓ లుక్కేయండి... 
 

Samsung Galaxy M55 ఈ నెలలో లాంచ్  కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ అప్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 30 వేల లోపే ఉంటుందని అంచనా.
 

చైనాకు చెందిన Realme సంస్థ Realme GT 5 Pro పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ 5400 mAh బ్యాటరీతో,100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్  చేస్తుంది. అలాగే 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్  ఇస్తుంది.
 


విడుదలకు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో OnePlus Nord CE 4 ఒకటి. దీనిని ఏప్రిల్ మొదటి వారంలో తీసుకురానున్నారు. ఈ ఫోన్  Snapdragon 7 Gen 3 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 27 వేలు ఉంటుందని అంచనా.
 

మోటో ఎడ్జ్ 50 ప్రో ఈ నెలలో  రానున్న  ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఏప్రిల్‌లోనే ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీనికి  6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ కర్వ్డ్ OLED డిస్‌ప్లే  ఉంది. దీని  స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 Hz.
 

Google Pixel 8A పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకువస్తోంది. ఏప్రిల్ లేదా మేలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్  Google AI ఫీచర్లను అందిస్తుంది. అంతేకాదు చాలా మంది ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.
 

Latest Videos

click me!