Watch
కానీ మీరు వాటిని స్టోర్లలో కొనేటప్పుడు అన్ని వాచ్ లు ఒక నిర్దిష్ట టైంలో అపి ఉంటాయి. ఖచ్చితంగా మనమందరం దీనిని గమనించి ఉంటాయి ఇంకా ఒక నిర్దిష్ట సమయంలో వాచ్ టైం సెట్ చేసి ఎందుకు అమ్మకానికి ఉంచుతారనే దానిపై కొన్ని కథనాలు కూడా విన్నాము.
Watch
కాబట్టి అన్ని గడియారాలు సరిగ్గా 10:10 ఎందుకు చూపుతాయి ? నేటికీ దీని గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌పై కాల్పులు జరిపిన సమయం. మరొకటి 10:10కి ఆయన మరణించడంతో ఆయన స్మారకార్థం దీన్ని ఏర్పాటు చేసినట్లు కొందరు చెబుతున్నారు. అయితే నిజానికి ఆయన మరణించిన సమయం ఉదయం 7 గంటలని కూడా మరికొందరు చెబుతున్నారు.
అదేవిధంగా రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబు వేసిన సమయం అది అని కొందరు అంటున్నారు. అయితే పేలుడు జరిగిన సమయం తెల్లవారుజామున అని మనందరికీ తెలుసు. వాస్తవానికి వాచ్ 10:10కి అపి ఉంచడానికి కారణం ఏమిటి?
సమయాన్ని 10.10గా చూపడానికి విస్తృతంగా ఉదహరించబడిన రెండు కారణాలలో V అనే ఆకారం ఒకటి. వి ఫర్ విక్టరీకి ప్రాతినిధ్యం వహించే విధంగా వాచ్‌ను ఉంచినట్లు చెబుతున్నారు. అలాగే వాచ్ టైం 10:10 వాచ్ ఏ బ్రాండ్ అని స్పష్టంగా చూపిస్తుంది, కాబట్టి వాటిని ఆ సమయంలో ఉంచుతారు అని కూడా చెబుతుంటారు.