5జి లాంచ్‌కు ముందే ప్రభుత్వం కీలక ప్రకటన.. 6జి కూడా వచ్చేస్తోంది...

First Published | Nov 24, 2021, 9:02 PM IST

భారతదేశంలో 5G ఇంకా ట్రయల్‌లోనే ఉంది. సాధారణ ప్రజలకు 5G ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తేదీని నిర్ణయించలేదు, అయితే భారతదేశం 6G కోసం సన్నాహాలు ప్రారంభించింది. 

2023 చివరి నాటికి భారతదేశంలో 6G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్  రైల్వే అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓ మీడియా సంస్థ వెబ్‌నార్‌లో అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు 6G టెక్నాలజీపై పని చేయడానికి అవసరమైన అనుమతి ఇప్పటికే లభించిందని  అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. 6జీకి వినియోగించే సాఫ్ట్‌వేర్‌లు, విడిభాగాలన్నింటినీ భారత్‌లోనే తయారు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. 
 

Latest Videos


దీంతోపాటు 6జీకి సిద్ధంగా ఉన్న మేడ్ ఇన్ ఇండియా విడిభాగాలను కూడా ఎగుమతి చేయనున్నారు. 6జీ మాత్రమే కాదు మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్‌వేర్, విడిభాగాలను 5జీకి కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇప్పటికే 5G స్పెక్ట్రమ్ కోసం సంప్రదింపుల ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. టెలికాం రెగ్యులేటర్ ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు కూడా 5G ట్రయల్ వ్యవధిని పొడిగించాలని కోరారు, దీంతో  వారికి 31 మార్చి 2021 వరకు అదనపు సమయం ఇచ్చారు.
 

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ ఇంకా వొడాఫోన్ ఐడియా వివిధ నగరాల్లో వాటి స్థాయిలో 5Gని పరీక్షిస్తున్నాయి. జియో ఇటీవల 5జి పరీక్ష కోసం షియోమీ ఇండియాతో చేతులు కలిపింది. రిలయన్స్ జియో నుండి స్మార్ట్‌ఫోన్ రెడ్ మీ  నోట్ 11టి 5జిలో 5జి నెట్‌వర్క్‌ను పరీక్షించింది.

click me!