అమెజాన్ యూజర్లకు షాక్.. వాటి ధర 50% వరకు పెంపు.. ఎప్పటినుంచి అంటే ?

First Published Nov 23, 2021, 6:08 PM IST

దేశీయ టెలికాం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ (amazon prime)మెంబర్‌షిప్ కూడా ఖరీదైనదిగా మారింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ 50 శాతం వరకు పెరిగింది. తాజా పెంపు 13 డిసెంబర్ 2021 నుండి వర్తిస్తుంది, అలాగే 1 సంవత్సరం సబ్ స్క్రిప్షన్  ధర రూ. 1,499 అయితే ప్రస్తుత ధర రూ. 999. సంవత్సరం సబ్ స్క్రిప్షన్ దాదాపు రూ.500 పెరుగనుంది. 
 

Amazon Prime 2021 Offer

ఇంకా ప్రతినెల, 3 నెలల ప్లాన్ల పై కూడా ఈ పెంపు ప్రభావం చూపుతుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్‌లు ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు అంటే అమెజాన్ సేల్(amazon sale) సమయంలో ఇతర కస్టమర్‌ల కంటే ముందు షాపింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ కూడా అందుబాటులో ఉంటాయి.

కొత్త అప్‌డేట్ తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రూ.999 నుండి రూ.1,499 అవుతుంది. దీని వాలిడిటీ 12 నెలలు. అలాగే రూ.329 త్రైమాసిక ప్లాన్ ధర రూ. 459, రూ. 129 ప్రతినెల ప్లాన్ ధర రూ. 179 అవుతుంది. అమెజాన్ ప్రైమ్ ఐదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టరు.

18-24 ఏళ్ల యువ కస్టమర్‌లకు 
అమెజాన్ ప్రైమ్ మే 2021 నుండి ప్రైమ్ యూత్ ఆఫర్‌లో భాగంగా 18-24 ఏళ్ల మధ్య ఉన్న కస్టమర్‌ల కోసం ప్రత్యేక ధరలను తీసుకొచ్చింది, అయితే కొత్త అప్ డేట్ తరువాత యువ కస్టమర్లకు త్రైమాసిక ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రూ. 164కి,  ప్రతినెల రూ.64కి తగ్గించింది. వార్షిక ప్లాన్ రూ. 499కి తగ్గించడంతో యువ కస్టమర్‌లు  ప్రయోజనం పొందుతారు.

click me!