Mobile Life Tips: మనం స్మార్ట్ ఫోన్ లను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటాం. కానీ కొన్ని ఫోన్లు ఏడాది కూడా సరిగ్గా పనిచేయవు. బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్ హ్యాంగ్ కావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకు కారణం మనం చేసే ఈ 5 తప్పులే. అవేంటో చూద్దాం.
బ్యాంకింగ్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు, చదువు నుంచి ఉద్యోగం వరకు దాదాపు ప్రతి పనికీ మనం మొబైల్ ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అలాంటి ఫోన్ ఒక్కసారిగా స్లో కావడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఫోన్ పాడవడానికి మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే ప్రధాన కారణమవుతాయి. మరి మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజులు కొత్తదానిలా పనిచేయాలంటే చేయకూడని తప్పులేంటో ఇక్కడ తెలుసుకోండి.
26
100 శాతం ఛార్జింగ్
చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఫోన్‌ను ఎప్పుడూ 100 శాతం వరకు ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా 0 శాతానికి వచ్చే వరకు ఉపయోగించడం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పూర్తిగా డిశ్చార్జ్ కావడం లేదా ఎక్కువసేపు ఛార్జ్‌లో ఉండడం వల్ల బ్యాటరీ క్రమంగా దెబ్బతింటుంది. నిపుణుల ప్రకారం బ్యాటరీని 20 నుంచి 80 శాతం మధ్య ఉంచడం మంచిది. అలాగే రాత్రంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయడం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. చాలా ఫోన్లలో స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉన్నప్పటికీ, అవసరానికి మించి ఛార్జింగ్ అలవాటు తగ్గిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.
36
డూప్లికేట్ ఛార్జర్ల వాడకం
చాలామంది ఒరిజనల్ ఛార్జర్ పాడైందని తక్కువ ధరలో దొరికే ఏదో ఒక ఛార్జర్ కొనేసి వాడుతుంటారు. కానీ నాణ్యత లేని ఛార్జర్లు సరైన వోల్టేజ్ ఇవ్వకపోవడం వల్ల బ్యాటరీతో పాటు ఫోన్‌లోని ఛార్జింగ్ సర్క్యూట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ వేడెక్కడం, ఛార్జింగ్ నెమ్మదిగా కావడం లేదా పూర్తిగా ఛార్జ్ కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్ లేదా నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిది.
చాలామంది ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు, అవసరం లేని యాప్‌లతో ఫోన్ మెమరీని పూర్తిగా నింపేస్తుంటారు. దీంతో ఫోన్ పనితీరు గణనీయంగా తగ్గిపోతుంది. యాప్‌లు ఓపెన్ కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ హ్యాంగ్ కావడం లేదా ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ కావడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం 15 నుంచి 20 శాతం వరకు స్టోరేజ్ ఖాళీగా ఉంచడం మంచిది.
56
ఫోన్ వేడెక్కినా పట్టించుకోకపోవడం
ఫోన్ లో గేమ్స్ ఎక్కువసేపు ఆడటం, ఎండలో ఫోన్ ఉపయోగించడం, ఛార్జింగ్‌లో పెట్టి వీడియోలు చూడటం వంటివి ఫోన్ వేడెక్కేలా చేస్తాయి. తరచూ ఇలా వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గడమే కాకుండా ప్రాసెసర్ పనితీరు కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో స్క్రీన్, మదర్‌బోర్డ్ వంటి కీలక భాగాలపై కూడా ప్రభావం పడుతుంది. ఫోన్ ఎక్కువగా వేడెక్కితే కొంతసేపు పక్కనపెట్టి, తర్వాత వాడడం మంచిది.
66
అప్‌డేట్ చేయకపోవడం
చాలామంది సాఫ్ట్ వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చినా పట్టించుకోరు. కానీ ఈ అప్‌డేట్‌లలో కొత్త ఫీచర్లతో పాటు భద్రతా లోపాల పరిష్కారాలు కూడా ఉంటాయి. అలాగే అధికారిక యాప్ స్టోర్ కాకుండా ఇతర వెబ్‌సైట్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం వల్ల వైరస్‌లు, మాల్వేర్ ఫోన్‌లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి ఫోన్‌ను స్లో చేయడమే కాకుండా వ్యక్తిగత సమాచారానికి కూడా ముప్పు కలిగిస్తాయి. అందుకే ఎప్పుడూ అధికారిక యాప్ స్టోర్ నుంచే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం, టైంకి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్‌ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.