Digital Ring: డిజిటల్ వాచ్‍లు బోర్ కొట్టేశాయా? అలా అని పెట్టుకోకపోతే ఎంత నడిచాం, ఎంత సేపు వర్కవుట్ చేశామన్నది ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు వాటి ప్లేస్ లో డిజిటల్ రింగ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. చూడటానికి చాలా యూనిక్‍గానూ ఉన్నాయి. మీకు నచ్చుతుంది.
డిజిటల్ వాచ్‍లు బోర్ కొట్టేశాయా? అలా అని పెట్టుకోకపోతే ఎంత నడిచాం, ఎంత సేపు వర్కవుట్ చేశామన్నది ఎలా తెలుస్తుంది? అయితే ఇప్పుడు వాటి ప్లేస్ లో డిజిటల్ రింగ్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. చూడటానికి చాలా యూనిక్‍గానూ ఉన్నాయి. మీకు నచ్చుతుంది. డిజిటల్ రింగ్ అనేది ఒక స్మార్ట్ వేరబుల్ డివైజ్. ఇది మన హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2), శరీర ఉష్ణోగ్రత, రోజువారీ ఫిట్‌నెస్ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఇది చాలా చిన్నగా, కాంపాక్ట్‌గా ఉండటంతో రోజంతా హాయిగా పెట్టుకోవచ్చు. దీని డిజైన్ చూడ్డానికి బంగారం లేదా ప్లాటినం ఉంగరంలా చాలా క్లాసీగా కనిపిస్తుంది.
25
మోడరన్ డిజిటల్ రింగ్ డిజైన్
మీకు లేటెస్ట్ టెక్నాలజీ ఇష్టమైతే, డిజిటల్ డిస్‌ప్లే ఉన్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ రింగ్ బెస్ట్ ఆప్షన్. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన ఈ రింగ్‌లో క్యాలరీ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్, హార్ట్ రేట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి హెల్త్ డేటాను ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
35
బడ్జెట్-ఫ్రెండ్లీ డిజిటల్ రింగ్
మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మార్కెట్లో తక్కువ ధరకే డిజిటల్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫింగర్ కౌంటర్ రింగ్స్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లే, రీసెట్ బటన్ ఉంటాయి. ముఖ్యంగా యోగా లేదా వాకింగ్ చేసేవాళ్లు ఈ రింగ్స్‌ను ఎంచుకోవచ్చు. వీటి డిజైన్ సింపుల్‌గా ఉంటుంది. వాడటం కూడా తేలికే.
సింపుల్ డిజైన్స్ కాకుండా, కాస్త కొత్తగా, స్టైలిష్‌గా ఉండేవి ఇష్టపడేవారికి ఈ యూనిక్ డిజైన్ స్మార్ట్ రింగ్ మంచి ఆప్షన్. ఇందులో అడ్జస్టబుల్ రింగ్ బ్యాండ్, బ్లూటూత్ కనెక్టివిటీ, అలారం ఫీచర్, OLED డిస్‌ప్లే, రీఛార్జబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ రింగ్స్ 18mm, 20mm, 22mm వంటి వేర్వేరు సైజుల్లో దొరుకుతాయి.
55
రోజ్ గోల్డ్ డిజిటల్ రింగ్
రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే స్మార్ట్ రింగ్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి చూడటానికి అచ్చం బంగారు ఆభరణంలా కనిపిస్తాయి, కానీ వీటిలో అడ్వాన్స్‌డ్ స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైన ఈ రింగ్స్ తేలికగా, మన్నికగా, సౌకర్యవంతంగా ఉంటాయి. హెల్త్ మానిటరింగ్‌తో పాటు మాగ్నెటిక్ ఛార్జింగ్, అనేక స్మార్ట్ యాప్స్ సపోర్ట్ కూడా ఉంటుంది.