ఆపిల్ ఐఫోన్ కొనేందుకు సూపర్ ఛాన్స్.. కేవలం రూ.16వేలకే.. అస్సలు మిస్సవకండి...!

First Published | Oct 9, 2023, 5:31 PM IST

దసరా - దీపావళి పండుగ సమీపిస్తోంది, ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సహా ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్  ప్రియులకు  ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు!
 

ఐఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా.. అయితే ఐఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంటుందని చాలా మంది కొనడానికి వెనుకాడతారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 12, 13, 14 సొంతం చేసుకునేందుకు అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నారు.  
 

ఆపిల్ ఐఫోన్ 12 ఇప్పుడు చాలా తక్కువ ధరలో లభిస్తుంది. ఈ అఫర్ సేల్  త్వరలో ఆగిపోవచ్చు. Apple iPhone 12 రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసారు  ఇంకా ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన iPhone మోడల్స్ లో ఒకటిగా ఉంది.  Apple iPhone 12 సిరీస్‌లో భాగంగా ఇందులో Apple iPhone 12 Pro అండ్  Apple iPhone 12 Pro Max ఉన్నాయి. 
 


Apple iPhone 15 సిరీస్‌ లాంచ్ తర్వాత Apple iPhone 12 Apple స్టోర్ నుండి తొలగించారు, త్వరలో ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా తీసివేయనుంది. 

Apple iPhone 12 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 25,600 భారీ డిస్కౌంట్ తర్వాత రూ. 16,399కి లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 12 అనేది ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే, ఐఫోన్ A14 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది.

Apple iPhone 12 ప్రస్తుత ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.41,999గా ఉంది. ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లేదా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 1000. డిస్కౌంట్  లభిస్తుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధర రూ.40,999కి తగ్గుతుంది. 
 

అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్‌గా రూ. 24,600 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్‌లు అండ్ డిస్కౌంట్‌ల తర్వాత మీరు Apple iPhone 12ని కేవలం రూ. 16,399కి పొందవచ్చు. 
 

Apple iPhone 12 సిరామిక్ షీల్డ్, IP68 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 12MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. నైట్ మోడ్, 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో కూడిన 12MP TrueDepth ఫ్రంట్ కెమెరా కూడా  ఉంది. అలాగే  64GB స్టోరేజ్‌తో బ్రాండ్ నుండి వచ్చిన చివరి ఫోన్ కూడా ఇదే.

Latest Videos

click me!