Mobile Number: మొబైల్‌ నెంబర్‌లో 10 అంకెలే ఎందుకు ఉంటాయి.? ఏ నెంబర్‌ దేనిని సూచిస్తుందో తెలుసా?

Published : Apr 08, 2025, 04:26 PM IST

ఒకప్పుడు ఊరిలో ఒక ఫోన్‌ ఉందంటేనే గొప్పగా భావించే వారు. ఆ తర్వాత వీధికో ఫోన్‌ వచ్చేసింది, అనంతరం ఇంటికో ఫోన్‌ వచ్చేసింది. ఇక ఎప్పుడైతే మొబైల్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో ఒక్కొక్కరు రెండేసి ఫోన్‌లను ఉపయోగించే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిందే. అయితే మీ ఫోన్‌ నెంబర్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 10 అంకేలే ఎందుకు ఉంటాయి.? వీటి అర్థం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Mobile Number: మొబైల్‌ నెంబర్‌లో 10 అంకెలే ఎందుకు ఉంటాయి.? ఏ నెంబర్‌ దేనిని సూచిస్తుందో తెలుసా?

మనందరికీ తెలిసినంత వరకు మొబైల్‌ నెంబర్‌కు 10 అంకెలు ఉంటాయి. అయితే 1995లో భారత్‌లో తొలిసారి సెల్‌ఫోన్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన సమయంలో మొబైల్‌ నెంబర్‌ 8 అంకెలతో ఉండేది. ఆ తర్వాత 2003 నుంచి 10 అంకెలను అమల్లోకి తీసుకొచ్చారు. దీనికి కారణం మొబైల్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడమే. 2003 నాటికి దేశంలో ఎక్కువ మంది మొబైల్‌ ఫోన్స్‌ను ఉపయోగించారు. దీంతో పది నెంబర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 
 

24

యూజర్ల సంఖ్య పెరిగితే నెంబర్లు ఎందుకు పెంచారనేగా మీ సందేహం.? 

10 అంకెల నంబర్‌ తయారు చేయాలంటే 0 నుంచి 9 వరకు ప్రతీ స్థానంలో ఒక అంకెను ఉపయోగించాలి. ఇలా పది అంకెలతో మొత్తం 10 బిలియన్‌ అంటే 1000 కోట్ల వేర్వేర్లు నెంబర్లను సృష్టించవచ్చు. కానీ 8 నెంబర్లు ఉన్న సమయంలో కేవలం 10 కోట్ల నెంబర్లకు మాత్రమే నెంబర్లను తయారు చేసేందుకు వీలు ఉండేదు. 2003 నాటికి క్రమంగా మొబైల్‌ యూజర్ల సంఖ్య పెరగడంతో మొబైల్‌ నెంబర్ల సంఖ్యను 10కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2025 నాటికి మొబైల్‌ కనెక్షన్ల సంఖ్య సుమారు 120 కోట్లు దాటినట్లు ట్రాయ్‌ అంచనా వేస్తోంది. 

34

పది అంకెల అర్థం ఏంటో తెలుసా.? 

పది అంకెల మొబైల్‌ నెంబర్‌లో మొదటి మూడు అంకెలు ఆపరేటర్ కోడ్‌ను సూచిస్తాయి. తర్వాతి 2-3 అంకెలు మొబైల్ సర్వీస్ కోడ్ (ఎమ్ఎస్‌సీ)ను, మిగిలినవి వినియోగదారుని గుర్తించే యూనిక్ ఐడెంటిఫైయర్‌(యూఐడీ)ని సూచిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాల్లో మొబైల్ నంబర్లు 10 లేదా 11 డిజిట్స్ ఉంటాయి. ఇది ఇంటర్నేషనల్ టెలికం ప్రమాణాలకు సరిపోయేలా ఉంటుంది.
 

44

మొత్తం మీద అధిక జనాభా ఉన్న భారతదేశం లాంటి పెద్ద దేశానికి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వాలంటే 10 అంకెలు అవసరం. అంతే కాక, టెక్నికల్ పరంగా, గ్లోబల్ నంబరింగ్ స్టాండర్డ్స్‌ను ఫాలో అవుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories