Instagram: క్రియేటర్లకు షాకిచ్చిన ఇన్​స్టాగ్రామ్​.. ఇకపై వారికే మాత్రమే 'లైవ్ ఫీచర్'..

Published : Aug 03, 2025, 12:28 PM IST

Instagram: ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం కొత్త నియమాలను అమలు చేసింది. లైవ్ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీకు కనీసం 1000 ఫాలోవర్లు ఉండటం తప్పనిసరి చేసిందని టెక్ క్రంచ్ ఓ నివేదికలో వెల్లడించింది.

PREV
15
ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం

Instagram live 1000 followers rule: ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మిని క్రియేటర్లకు బిగ్ షాక్ ఇచ్చేలా కొన్ని నియమాలలో మార్పు చేసింది. ఈ మార్పుతో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయలేరు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఫీచర్‌ను ఉపయోగించాలనుకునే ఉండాల్సిన అర్హతలేంటీ? అనే వివరాలు మీ కోసం.  

25
ఇన్‌స్టాగ్రామ్ కొత్త పాలసీ

ఇన్‌స్టాగ్రామ్ కొత్త పాలసీని ప్రవేశపెట్టింది, ఈ పాలసీ ప్రకారం కనీసం 1,000 మంది ఫాలోవర్లు, పబ్లిక్ అకౌంట్ ఉన్న వినియోగదారులు మాత్రమే దాని 'లైవ్' ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని టెక్ క్రంచ్‌లోని ఒక నివేదిక తెలిపింది. గతంలో ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏ యూజర్ అయినా, వారి ఫాలోవర్ల సంఖ్యతో సంబంధం లేకుండా పబ్లిక్ ఖాతా అయినా.. ప్రైవేట్‌ ఖాతా అయినా ఎలాంటి సంబంధం లేకుండా లైవ్‌ లో పాల్గొనే అవకాశముండేది.  

35
టిక్‌టాక్ బాటలో ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్ కొత్త విధానాన్ని గమనిస్తే.. టిక్‌టాక్ అడుగుజాడల్లో నడుతున్నట్టు అనిపిస్తుంది. టిక్‌టాక్‌లో కూడా, 1000 మంది ఫాలోవర్లు ఉన్న తర్వాతే లైవ్ ఫీచర్ అన్‌లాక్ అవుతుంది. మరోవైపు యూట్యూబ్‌ను పరిశీలిస్తే కనీసం 50 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నవారు మాత్రమే లైవ్‌ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో టిక్‌టాక్ నియమాలను అమలు చేయడానికి అసలు కారణం స్పష్టంగా లేనప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్ దాని లైవ్ నాణ్యతను పెంచడానికి ఇలా చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 

45
విభిన్న అభిప్రాయాలు

వాస్తవానికి 1000 మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్లు మాత్రమే న్యూ కంటెంట్‌పై ఆసక్తి కలిగి ఉన్నారని, అలాంటి వినియోగదారులకు మాత్రమే లైవ్ ఫీచర్‌కు యాక్సెస్ ఇస్తే.. కంటెంట్ నాణ్యత మరింత పెరుగుతుందని తెలుస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ప్రారంభించాలని చూస్తున్న కానీ అర్హత లేని వారికి, ఈ ఫీచర్ ఇకపై వారికి అందుబాటులో లేదని తెలిపే పోస్టులు కనిపిస్తున్నాయి.  "మీ ఖాతాకు లైవ్‌కు అర్హత లేదు. ఈ ఫీచర్‌లో కొన్ని మార్పుల చేశాం. 1,000 లేదా అంతకంటే ఎక్కువ మంది అనుచరులు ఉన్న పబ్లిక్ ఖాతాలు మాత్రమే లైవ్ వీడియోలను సృష్టించగలవు" అని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ మార్పు చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ ఎటువంటి నిర్దిష్ట కారణాన్ని అందించనప్పటికీ, లైవ్ ఎక్స్పీరియస్ పెంచడానికి ఈ చర్య తీసుకున్నట్లు యూజర్లు భావిస్తున్నారు. 

55
మిని కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్!

ఇన్ స్టాగ్రామ్ నిర్ణయం మిని కంటెంట్ క్రియేటర్లకు, ప్రత్యక్ష ప్రసారంలో స్నేహితులతో ఆనందించే యూజర్స్ పై ప్రభావితం మరికొందరూ ఫీల్ అవుతున్నారు. "నేను ఇన్‌స్టాగ్రామ్‌తో ఎందుకు ఇబ్బంది పడుతున్నానో నాకు అర్థం కావడం లేదు" అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరొ యూజర్ " ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనల కోసం ఉపయోగించాలని వారు ప్రభావితం అవుతున్నారు. ఇకపై లైవ్ లో మీ అనుభవాలను ఇతరులతో పంచుకోలేరు " అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories