ఇక ఈ ఫోన్‌లో ఇంటరాక్టివ్ డైనమిక్ బార్ ఫీచర్‌ను ఇచ్చారు. ఇందులో ఫేస్ లన్‌లాక్, బ్యాగ్రౌండ్ కాల్, ఛార్జింగ్ యానిమేషన్, ఛార్జ్ కంప్లిషన్ రిమైండర్, లో బ్యాటరీ రిమైండర్ వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో డీటీఎస్ స్పీకర్, ఐ కేర్, ఏఐ గ్యాలరీ, ఓటీజీ సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.