వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన మీ గర్ల్‌ఫ్రెండ్‌కి మెసేజ్‌ ఎలా పంపాలో తెలుసా.?

Published : Feb 13, 2025, 03:08 PM ISTUpdated : Feb 13, 2025, 06:15 PM IST

Whats App: ప్రతీ ఒక్క స్మార్ట్‌ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత డిమాండ్‌ ఉంది. ఇలా వాట్సాప్‌ తీసుకొచ్చిన ఫీచర్స్‌లో బ్లాక్‌ ఫీచర్‌ ఒకటి..   

PREV
14
వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన మీ గర్ల్‌ఫ్రెండ్‌కి మెసేజ్‌ ఎలా పంపాలో తెలుసా.?
Whats App

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సాప్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందుకే ఎన్ని రకాల కొత్త మెసేజింగ్ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గడం లేదు. ఇక వాట్సాప్‌ ఇలా తీసుకొచ్చిన ఫీచర్లలో బ్లాక్‌ ఆప్షన్‌ ఒకటి. ఒక వ్యక్తి నుంచి మెసేజ్‌లు రాకుండా ఉండాలంటే బ్లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తికి మెసేజ్‌ పంపించే అవకాశం కూడా ఉందని తెలుసా.? ఇందుకోసం రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

24
Whats App

బ్లాక్‌ చేసిన విషయం ఎలా తెలుసుకోవాలి? 

సాధారణంగా మనల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే వారి ప్రొఫైల్‌ పిక్‌ కనిపించదు. అలాగే వారు పోస్ట్‌ చేసే స్టేటస్‌లు కూడా కనిపించడం ఆగిపోతాయి. దీంతో పాటు మీరు సదరు వ్యక్తికి మెసేజ్‌ పంపిస్తే బ్లూ టిక్‌ కనిపించదు. మీరు కాల్‌ చేసినా వారికి రింగ్‌ అవ్వదు. వీటి ఆధారంగా ఒక వ్యక్తి మిమ్మల్ని బ్లాక్‌ చేశార్న విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి బ్లాక్‌ చేసిన వ్యక్తికి మెసేజ్‌ ఎలా పంపాలి. 
 

34

అకౌంట్ డిలీట్‌ చేయండి. 

మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తికి మెసేజ్‌ పంపాలంటే ముందుగా మీ వాట్సాప్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేయాలి. ఆ తర్వాత మళ్లీ కొత్తగా మీ ఫోన్‌ నెంబర్‌తో వాట్సాప్‌ అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు ఆటోమెటిక్‌గా అన్‌బ్లాక్‌ అవుతారు. దీంతో మీరు పంపించిన మెసేజ్‌ వారికి వెళ్తుంది. అదే విధంగా వారి డీపీ, స్టేటస్‌లు కనిపిస్తాయి. అయితే ఇలా అకౌంట్‌ను డీ యాక్టివ్‌ చేస్తే మీ పాత చాట్‌ను యాక్సెస్‌ చేయలేరు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని అకౌంట్ డిలీట్‌ చేయాలి. అకౌంట్‌ డిలీట్‌ చేయడం కోసం ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిలీట్ మై అకౌంట్ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. 
 

44

గ్రూప్‌ క్రియేట్‌ చేయాలి.

మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తితో చాట్‌ చేయాలంటే వారిని గ్రూప్‌లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు మూడో వ్యక్తి సాయం లేదా మీకే ఇంకో వాట్సాప్‌ నెంబర్‌ ఉన్నా పర్లేదు. ఇందుకోసం ముందుగా మీతో పాటు మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తి, అలాగే మూడో నెంబర్‌తో కలిపి గ్రూప్‌ క్రియేట్‌ చేయాలి. ఇలా చేస్తే మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తి కూడా ఆ గ్రూప్‌లో ఉంటాడు. దీంతో మీరు ఆ గ్రూప్‌లో సెండ్‌ చేసిన మెసేజ్‌ మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తికి కనిపిస్తుంది. 
 

click me!

Recommended Stories