పోకో సీ75 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 22 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 8,499కే లభిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.88 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 50 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.