Password: మీ FB, Insta, Gmail పాస్‌వ‌ర్డ్‌లు మ‌ర్చిపోయారా.? ఫోన్‌లోనే అన్నీ ఉంటాయ్ ఎలా చూసుకోవాలంటే

Narender VaitlaPublished : Apr 23, 2025 7:01 PM

ప్ర‌స్తుతం స్మార్ట్ ఉప‌యోగించ‌ని వారు లేర‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇంట‌ర్నెట్ ఛార్జీలు త‌గ్గ‌డం, యూజ‌ర్ ఫ్రెండ్లీ యాప్స్ అందుబాటులోకి రావ‌డంతో చాలా మంది ఫోన్‌ల‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఫోన్‌లో మ‌న‌కు తెలియ‌ని ఎన్నో హిడెన్ ఫీచ‌ర్లు ఉంటాయని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచ‌ర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

14
Password: మీ FB, Insta, Gmail పాస్‌వ‌ర్డ్‌లు మ‌ర్చిపోయారా.? ఫోన్‌లోనే అన్నీ ఉంటాయ్ ఎలా చూసుకోవాలంటే

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, జీమెయిల్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యాప్‌లు ఉంటాయి. దాదాపు ప్ర‌తీ ఒక్క‌రికీ సోష‌ల్ మీడియాలో అకౌంట్ ఉంటోంది. అయితే సోష‌ల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసిన స‌మ‌యంలో సెట్ చేసుకున్న పాస్‌వ‌ర్డ్ మ‌న‌లో చాలా మందికి గుర్తుండి ఉండ‌దు. పాస్‌వ‌ర్డ్ సేవ్ చేసుకోవ‌డంతో ఆటోమేటిక్‌గా యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడ‌ల్లా ఓపెన్ అవుతుంది. 

24

అయితే పొర‌పాటున ఎప్పుడైనా డేటా కోల్పోతే ప‌రిస్థితి ఏంటి.? లేదూ... మ‌రో డివైజ్‌లో యాప్‌ను ఓపెన్ చేయాలంటే క‌చ్చితంగా యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఉండాల్సిందే. అలాంటప్పుడు మ‌న పాస్‌వ‌ర్డ్‌లు తెలుసుకోవ‌డానికి ఓ సింపుల్ ట్రిక్ ఉంద‌ని మీకు తెలుసా.? మీ ఫోన్‌లోనే మీ అన్ని పాస్‌వ‌ర్డులు భ‌ద్రంగా ఉంటాయి. ఇంత‌కీ ఆయా పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

34

* ఇందు కోసం స్మార్ట్ ఫోన్‌లో ముందుగా సెట్టింగ్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి. 

* అనంత‌రం చివ‌రికి స్క్రోల్ చేస్తే గూగుల్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

* గూగుల్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత అందులో గూగుల్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 

* గూగుల్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌లో క‌నిపించే ఆల్ స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 

44

* ఆ త‌ర్వాత ఆటోఫిల్ విత్ గూగుల్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. 

* అనంత‌రం అందులో క‌నిపించే గూగుల్ పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 

* వెంట‌నే మీ ఫోన్‌లో లాగిన్ అయిన అన్ని యాప్స్ క‌నిపిస్తాయి. 

* మీరు పాస్‌వ‌ర్డ్ తెలుసుకోవాల‌నుకుంటున్న యాప్‌ను క్లిక్ చేసిన వెంట‌నే యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ క‌నిపిస్తుంది. 

Read more Photos on
click me!