Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి కంటెంట్‌ ఎక్కువగా కనిపిస్తుందా.? పిల్లలకు ఫోన్‌ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందా?

Published : Feb 27, 2025, 07:25 PM IST

సోషల్‌ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ ఎక్కువగా సర్క్యూలేట్‌ అవుతోంది. అయితే ఈ కంటెంట్‌ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
12
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి కంటెంట్‌ ఎక్కువగా కనిపిస్తుందా.? పిల్లలకు ఫోన్‌ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందా?

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతున్నారు. ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే ఈ యాప్‌కు ఇంత క్రేజ్‌ ఉందని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల 18+ కంటెంట్‌ పెరుగుతోంది. వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లోని అసభ్యకరమైన కంటెంట్‌ను రీల్స్‌ రూపంలో ఎక్కువగా పోస్ట్‌ చేస్తున్నారు. 

ఒక్కసారి పొరపాటున ఈ వీడియోలు చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌ ఇదే కంటెంట్‌ను సజెస్ట్‌ చేస్తుంది. దీంతో మన ఫోన్‌ను ఎవరికైనా ఇవ్వాలంటే ఇబ్బందిగా మారుతుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి కంటెంట్‌ కనిపించకుండా ఉండాలంటే మీ యాప్‌లో ఒక చిన్న సెట్టింగ్‌లో మార్పు చేసుకోవచ్చు. ఇంతకీ ఏంటా సెట్టింగ్‌, ఎలా మార్చుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

22
Instagram

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.. 

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. 

* అనంతరం మీ ప్రొఫైల్‌ను ఓపెన్‌ చేసి పైన కుడివైపు కనిపించే 'త్రీ డాట్స్‌'ను సెలక్ట్ చేసుకోవాలి. 

* కిందికి స్క్రోల్‌ చేస్తే 'సజెస్ట్‌డ్‌ కంటెంట్‌' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దానిని క్లిక్‌ చేసిన తర్వాత 'కన్ఫర్మేషన్‌' చేయగానే. మీ డేటాను రిఫ్రెష్‌ చేయంటారా.? అని అడుగుతుంది. 

* నెక్ట్స్‌ బటన్‌పై క్లిక్‌ చేయగానే రీసెట్‌ సజెస్టెడ్‌ కంటెంట్‌పై క్లిక్‌ చేయాలి. రీసెట్ నొక్కగానే హోం పేజీ ఓపెన్‌ అవుతుంది. 

* ఆ తర్వాత మీ ప్రొఫైల్‌లోకి వెళ్లాలి. అనంతరం బ్యాక్‌ వస్తే సెన్సిటివ్‌ కంటెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దానిని క్లిక్‌ చేసి 'లెస్‌'ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే మీ ఇన్‌స్టాగ్రామ్‌ రీసెట్ అవుతుంది. అభ్యంతకర కంటెంట్‌ రావడం తగ్గిపోతుంది. 

click me!

Recommended Stories