యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అంటే ఏమిటి?
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ చట్టం ఆగస్టు 2023లో తాత్కాలికంగా అమలులోకి వచ్చింది. ఆర్టికల్స్ 30, 31 ప్రకారం యాప్ డెవలపర్లు తమ ట్రేడర్ వివరాలైన అడ్రస్, ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటి వాటిని వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ వివరాలు లేకుంటే యూరోపియన్ యూనియన్ ప్రాంతాల్లో యాప్‌లను అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2024 నుంచి అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. ఫిబ్రవరి 17వ తేదీలోపు ట్రేడర్ స్టేటస్ వివరాలను అందించకపోతే వారి యాప్‌లను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తామని యాపిల్ ఇప్పటికే హెచ్చరించింది. తాజాగా వివరాలను అందించని యాప్‌లను తొలగించేసింది.