Google: అందుబాటులోకి గూగుల్ కొత్త క్యాంపస్‌.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు, ఎన్ని ప్రత్యేకతలో

Published : Feb 19, 2025, 08:19 PM IST

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో మరో క్యాంపస్‌ను ప్రారంభించింది. ఐటీ నగరం బెంగళూరులో తన నాలుగో కార్యలయాన్ని ప్రారంభించింది. 'అనంత' పేరుతో నిర్మించిన ఈ కొత్త క్యాంపస్‌లో గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్‌ పే, క్లౌడ్‌తో పాటు మరికొన్ని అప్లికేషన్స్‌కు సంబంధించిన పనులు జరగనున్నాయి. ఈ క్యాంపస్‌లో మొత్తం 5 వేల మంది పనిచేయనున్నారు..   

PREV
14
Google: అందుబాటులోకి గూగుల్ కొత్త క్యాంపస్‌.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు, ఎన్ని ప్రత్యేకతలో
Google

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ బుధవారం (ఫిబ్రవరి 19) బెంగళూరులో తన అతిపెద్ద కార్యాలయాల్లో ఒకటైన 'అనంత' క్యాంపసను ప్రారంభించింది. సంస్కృతంలో అనంత అంటే అపరిమితం అని అర్థం. ఈ క్యాంపస్‌ను చూస్తే ఈ పేరుకు సరిగ్గా సరిపోతుంది గూగుల్‌ ఈ క్యాంపస్‌ను బెంగళూరులోని మహదేవపురంలో 1.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది. ఇది భారత దేశంలో ఉన్న గూగుల్‌ అన్ని క్యాంపస్‌లలతో అతిపెద్దదిగా నిలిచింది. ఈ క్యాంపస్‌ను అత్యాధునిక హంగులు, సదుపాయాలతో నిర్మించారు. 

24

ఈ క్యాంపస్‌ ప్రారంభం సందర్భంగా గూగుల్ ఇండియా ఉపాధ్యక్షురాలు, మేనేజర్‌ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. భారతదేశం తమ పౌరులకు సాంకేతికను శరవేగంగా చేరువ చేస్తున్న నేపథ్యంలో 20 ఏళ్లుగా గూగుల్‌ ఇందులో భాగస్వామిగా ఉండడం గర్వంగా ఉందన్నారు. బెంగళూరులోని కొత్త అనంత క్యాంపస్ త ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. శరవేగంగా పెరుగుతోన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ఈ క్యాంపస్‌ కేంద్ర బిందువుగా కానుందన్నారు. భవిష్యత్తులో తాము కొన్ని కీలక రంగాలపై దృష్టి సారించామన్నారు. వ్యాపారాలాఉ, వ్యవసాయం ఆరోగ్యం, ఫిన్‌టెక్‌ వంటి రంగాల్లో ఏఐ వినియోగాన్ని మరింత పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. 

బెంగళూరును 'గార్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా'గా చెబుతుంటారు. దీనికి అనుగుణంగానే గూగుల్‌ కొత్త క్యాంపస్‌ను నిర్మించింది. క్యాంపస్‌లో పచ్చని చెట్లను, వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేసింది. జాగింగ్‌ మార్గాలు, రంగురంగులతో కూడిన సిట్టింగ్‌ ప్రాంతాలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిపించింది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న సైజ్‌ అడవిలా క్యాంపస్‌ను నిర్మించారు.
 

34

ఇతర గూగుల్ కార్యాలయాల మాదిరిగానే, అనంత క్యాంపస్ కూడా ఎకో ఫ్రెండ్లీగా రూపొందిచారు. క్యాంపస్‌లో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థ జలాలను 100 శాతం రీసైకిల్ చేస్తారు. వర్షపునీటి సంరక్షణ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి భవనంపై పెద్ద స్మార్ట్ ఎలక్ట్రో-క్రోమిక్ గ్లాస్‌ను అమర్చారు. కార్యాలయం లోపలి భాగాన్ని దాదాపు పూర్తిగా స్థానికంగా లభించే వస్తువులతోనే రూపొందించారు. అలాగే దృష్టి లోపంతో బాధపడేవారికి అనుగుణంగా నావిగేషన్ సపోర్ట్‌తో ఉండే కొత్త టచ్ ఫ్లోరింగ్, బ్రెయిలీ వివరాలు వంటివి ఏర్పాటు చేశారు. 

ఇక ఉద్యోగుల పిల్లల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసున్న పిల్లలకు ప్రత్యేకంగా పిల్లల డేకేర్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు యోగా,మెడిటేషన్‌ చేసుకునే ఏర్పాట్లు. అలాగే ఫిట్‌నెస్‌ కోసం 1000 చదరపు అడుగుల జిమ్, బ్యాడ్మింటన్, పికిల్‌బాల్, వాలీబాల్, క్రికెట్ వంటి వాటికోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్‌ను మొత్తం 11 అంతస్తుల్లో నిర్మించారు. 
 

44
google-campus

బెంగళూరుతో పాటు, గూగుల్ భారతదేశంలో గురుగ్రామ్, హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. మొత్తం 11,000 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా గూగుల్ భారతదేశంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. ముఖ్యంగా AI, వ్యవసాయం, స్థిరత్వం, ఆరోగ్య రంగాలలో స్థానిక స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తోంది. అక్టోబర్ 2024లో, గూగుల్ స్టార్టప్‌లు, NGOలతో పాటు ప్రభుత్వ సంస్థలకు వ్యవసాయ భూభాగ అవగాహన (ALU) పరిశోధనా APIని అందించింది.

click me!

Recommended Stories