కెమెరా పరంగా చూస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ డ్యూయల్ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు. ఈ ఫోన్‌లో లిథియం పాలీమర్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 34 గంటల టాక్‌టైమ్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు.