Manu Bhaker: తృటిలో ఒలింపిక్స్ మూడో మెడ‌ల్ మిస్సైన మ‌ను భాకర్..

First Published | Aug 3, 2024, 1:41 PM IST

Paris Olympic-Manu Bhaker :  పారిస్ ఒలింపిక్స్ లో మూడో మెడ‌ల్ తో చ‌రిత్ర సృష్టించే  అవ‌కాశ‌న్ని మ‌ను భాక‌ర్ తృటిలో కోల్పోయారు. 

Paris Olympic-Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇప్ప‌టికే రెండు మెడ‌ల్స్ గెలిచిన రికార్డు సృష్టించింది భార‌త షూట‌ర్ మ‌ను భాక‌ర్. మూడో మెడ‌ల్ కోసం శ‌నివారం జ‌రిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌ ఫైనల్ లో పోటీ పడ్డారు. అయితే, తృటిలో మ‌ను భాక‌ర్ మెడ‌ల్ గెలుచుకునే అవ‌కాశాన్ని కోల్పోయారు. ఫైన‌ల్ లో 4వ స్థానంలో నిలిచారు.

మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌ లో కాంస్య పతకం కోసం గట్టి పోటీ ఉన్నప్పటికీ, మను అద్భుత‌మైన ప్రయత్నం మిలియన్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. పారిస్ ఒలింపిక్స్ లో ఆమె సాధించిన విజ‌యాలు చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. 
 

Latest Videos


22 ఏళ్ల మ‌ను భాక‌ర్  మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అంతటా బలమైన పోటీదారుగా ముందుకు సాగింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లలో ఆకట్టుకున్నాడు, 'ప్రెసిషన్' రౌండ్‌లో స్టెల్లార్ 294, 'రాపిడ్' రౌండ్‌లో 296 సహా మొత్తం 590 స్కోర్ చేశాడు. అయినప్పటికీ, ఫైనల్‌లో ఆమె గట్టి పోటీని ఎదుర్కొంది. చివ‌ర‌కు నాల్గో స్థానంతో ముగించింది. 

మ‌ను భాక‌ర్ ఒలింపిక్స్ రికార్డులు గ‌మ‌నిస్తే.. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో సుమ షిరూర్ తర్వాత ఒలింపిక్ షూటింగ్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళ మ‌నుభాక‌ర్. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కూడా మ‌ను భాక‌ర్.
 

అలాగే, ఎయిర్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్. ఒలింపిక్స్ లో ఒకే ఎడిషన్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్ మ‌ను భాక‌ర్. 

Manu Bhaker

రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత షూటర్ మ‌ను భాక‌ర్. ఒలింపిక్స్ లో టీమ్ మెడల్ సాధించిన తొలి భారత షూటింగ్ జంట (మను భాక‌ర్, సరబ్ జ్యోత్ సింగ్). వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్.

మరే ఇతర భారతీయ షూటర్ ఒకే ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఫైనల్‌కు చేరుకోలేదు. గతంలో అభినవ్ బింద్రా మాత్రమే మూడు గేమ్‌లలో భారత్ తరఫున మూడు ఒలింపిక్ షూటింగ్ ఫైనల్స్ చేరుకున్నాడు.

click me!