Yearender 2023: ప్ర‌పంచవ్యాప్తంగా 2023లో ప్రభావం చూపిన టాప్-10 అథ్లెట్లు వీరే..

First Published | Dec 12, 2023, 2:48 PM IST

Google Year in Search 2023: అమెరికన్ ఫుట్ బాల్ సూప‌ర్ స్టార్ డమర్ హామ్లిన్ 2023 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయ‌బ‌డిన అథ్లెట్ గా ఉండ‌గా, త‌ర్వాతి స్థానంలో  పారిస్ సెయింట్-జర్మైన్ సాకర్ సంచలనం కైలియన్ ఎంబాపె రెండో స్థానంలో ఉన్నాడు. 
 

Damar Hamlin, Kylian Mbappe, Shubman Gill

Google’s Most Searched People in the World 2023: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన వారితో కూడిన గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2023' జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో నటులు, అథ్లెట్లు, ఆటలు, సినిమాలు, సంగీతకారులు, రెసిపీ, పాటలు మొదలైన వివిధ విభాగాలు ఉన్నాయి. 2023లో ప్రపంచంలో గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 వ్యక్తుల జాబితాలో ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్ డమర్ హామ్లిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 

గూగుల్ మోస్ట్ సెర్చ్ టాప్-10 అథ్లెట్ల జాబితాలో ఉన్న‌ది వీరే..
 

Damar Hamlin

1. డమర్ హామ్లిన్ (Damar Hamlin, American Football)

డమర్ హామ్లిన్  నేషనల్ ఫుట్ బాల్ లీగ్ (ఎన్ ఎఫ్ ఎల్) లో ఒక అమెరికన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. 2023 జనవరిలో లైవ్ టెలివిజన్ లో ఒక ఆట సందర్భంగా డ‌మ‌ర్ హామ్లిన్ గుండెపోటుకు గురయ్యారు. హామ్లిన్ తన ఎన్ఎఫ్ఎల్ ఆట సమయంలో కుప్పకూలిపోయాడు, తరువాత అతన్ని తక్షణ అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాడు. ఫుట్ బాల్ సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. 
 


Kylian Mbappé

2. కైలియ‌న్ ఎంబాపే (Kylian Mbappe-Association Football)

కైలియన్ ఎంబాపే ఒక ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఫ్రాన్స్ జాతీయ జట్టు కెప్టెన్. గూగుల్‌లో ప్రపంచ జాబితాలో అత్యధికంగా శోధించబడిన టాప్ 10 అథ్లెట్లలో ఎంబాపే రెండో స్థానంలో ఉన్నాడు. అత‌న‌కు ఒక ఫుడ్ బాల్ స్టార్ ప్లేయ‌ర్. 
 

Travis Kelce, American Football

3. ట్రావిస్ కెల్సే (Travis Kelce, American Football)

ట్రావిస్ కెల్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో ఒక అమెరికన్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు. టేలర్ స్విఫ్ట్‌తో డేటింగ్ ప్రారంభించిన తర్వాత 2023లో అత్యధికంగా శోధించిన వ్యక్తుల జాబితాలో కెల్సే చోటు దక్కించుకున్నాడు. 

Image credit: X@TheDunkCentral

4. జా మోరాంట్ (Ja Morant, Basketball)

జా మోరాంట్ బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయ‌ర్. అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. ఎన్బీయే మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్-2022, ఎన్బీయే రూకీ ఆఫ్ ది ఇయర్-2020 సహా అనేక అవార్డులు అందుకున్నాడు.
 

Harry Kane

5. హ్యారీ కేన్ (Harry Kane, Association Football)

హ్యారీ కేన్ ఒక ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. కేన్ ఇంగ్లండ్ తరఫున 89 మ్యాచ్‌ల్లో 62 గోల్స్ చేశాడు. 2023లో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా ఒక ఒప్పందం చేసుకున్నాడు. యూఈఎఫ్ఏ యూరో 2020 క్వాలిఫైయింగ్ రౌండ్‌లో , ఇంగ్లండ్ ఆడిన 1,000వ మ్యాచ్‌కు కేన్ కెప్టెన్‌గా ఉన్నాడు. మాంటెనెగ్రోపై హ్యాట్రిక్ సాధించాడు.
 

Novak Djokovic

6. నొవాక్ జకోవిచ్ (Novak Djokovic, Tennis)

నోవాక్ జకోవిచ్ టెన్నిస్ దిగ్గ‌జ ఆట‌గాడు. ప్రస్తుతం అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్నాడు. జొకోవిచ్ రికార్డు స్థాయిలో401 వారాల పాటు నం. 1 స్థానంలో ఉన్నాడు. జొకోవిచ్ ఆల్-టైమ్ రికార్డ్ 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించాడు. ట్రిపుల్ కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఏకైక ఆట‌గాడు.
 

Carlos Alcaraz

7. కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz, Tennis)

కార్లోస్ అల్కరాజ్ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు. మియామి ఓపెన్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా, 
2022లో మాడ్రిడ్ ఓపెన్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, 2022 ఏటీపీ ప్రపంచ నంబ‌ర్ వ‌న్ గా మారిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చ‌రిత్ర సృష్టించాడు. 
 

Rachin Ravindra

8. రచిన్ రవీంద్ర (Rachin Ravindra, Cricket)

కివీస్ యువ క్రికెటర్ రచిన్ రవీంద్ర మంచి ఆల్ రౌండర్. ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ వరల్డ్ కప్ అరంగేట్రంలోనే సెంచరీతో స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ గా చ‌రిత్ర సృష్టించాడు. అలాగే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టాడు. మెరుగైన ప్రతిభ, సామర్థ్యం అతన్ని న్యూజిలాండ్ క్రికెట్ కు భవిష్యత్ స్టార్ గా నిలబెట్టాయి.
 

Shubman Gill

9. శుభ్‌మన్ గిల్ (Shubman Gill, Cricket)

1999 లో జన్మించిన భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన స్టైల్ స్ట్రోక్ ప్లే తో స్టార్ ప్లేయ‌ర్ గా ఎదిగాడు. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ టీమ్ లో కీ ప్లేయ‌ర్. ప్రతిభావంతుడైన ఓపెనింగ్ బ్యాట్స్మన్. అండర్-19 వరల్డ్ కప్ లో తన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇది బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీతో త‌ర్వాత భార‌త్ నుంచి వ‌స్తున్న స్టార్ క్రికెట్ గా గుర్తింపు సంపాదించాడు. 
 

Image credit: Wikimedia Commons

10. కైరీ ఇర్వింగ్ (Kyrie Irving, Basketball)

 కైరీ ఇర్వింగ్ డల్లాస్ మావెరిక్స్ ఆఫ్ ది నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కు కొన‌సాగుతున్న‌  ఒక ఆస్ట్రేలియన్-అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్. ఎన్బీయేలో స్టార్ ప్లేయ‌ర్, అనేక అంత‌ర్జాతీయ అవార్డులు అందుకున్నారు. 
 

Latest Videos

click me!