Google Year in Search 2025: 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనదైన ఆటతో దుమ్మురేపుతున్నాడు. ఇదే క్రమంలో దిగ్గజాలైన కోహ్లీ, రోహిత్‌లను అధిగమించి భారతదేశంలో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన వ్యక్తిగా నిలిచాడు.
Google Year in Search 2025: దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యంగ్ క్రికెట్ స్టార్ వైభవ్ సూర్యవంశీకి 2025 సంవత్సరం ఒక కలలాంటిదని చెప్పాలి. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే, అతను తుపాను ఇన్నింగ్స్‌లు, సెంచరీలతో సంచలనం రేపాడు. బ్యాట్ తో బౌలర్ల పనిపట్టాడు. అందుకే ప్రజలు అతని బ్యాటింగ్ చూడటమే కాకుండా, అతని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపించారు.
2025లో ఏ క్రికెటర్ గురించి అయినా అత్యధిక చర్చ జరిగిందంటే అది కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ గురించే. ఈ విషయంలో భారత లెజెండరీలను వెనక్కి నెట్టాడు. మైదానంలోనే కాకుండా గ్రౌండ్ బయట కూడా వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగుతోంది.
అతను క్రికెట్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాకుండా, ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగారు. అందుకే 2025లో అతని గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహం చూపించారు. ఫలితంగా, వైభవ్ సూర్యవంశీ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనేక మంది భారతీయ దిగ్గజాలను ఒకే దెబ్బతో అధిగమించారు. ఈ సంవత్సరం భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా ఆయన నిలిచాడు.
26
అగ్రస్థానంలో వైభవ్ సూర్యవంశీ.. దిగ్గజాలు వెనక్కి
గూగుల్ తాజాగా 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం, 2025లో భారతదేశంలో అత్యధిక మంది సెర్చ్ చేసిన వ్యక్తి వైభవ్ సూర్యవంశీనే. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు టాప్ 10 జాబితాలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. ఈ ఏడాది వైభవ్ సూర్యవంశీ కేవలం అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ క్రికెటర్ మాత్రమే కాకుండా, భారతదేశంలోనే అత్యధికంగా వెతికిన వ్యక్తిగా కూడా నిలిచారని గూగుల్ ట్రెండ్స్ సూచిస్తోంది.
36
2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 భారతీయులు
వైభవ్ సూర్యవంశీ బీహార్‌కు చెందినవాడు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి అతను వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట ఐపీఎల్ 2025, ఆ తర్వాత ఇండియా-ఏ, అండర్-19, ఇప్పుడు దేశవాళీ క్రికెట్.. ఇలా ప్రతి ఫార్మాట్ లో వైభవ్ తనదైన ముద్ర వేస్తున్నాడు. గూగుల్ సెర్చ్‌లో అతని తర్వాత అభిషేక్ శర్మ, షేక్ రషీద్, జెమిమా రోడ్రిగ్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు ఈసారి టాప్-5లో కూడా లేరు.
56
ఐపీఎల్ 2025 అరంగేట్రంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2025 ద్వారానే అసలైన గుర్తింపు లభించింది. రాజస్థాన్ రాయల్స్ అతనిని గుర్తించినప్పుడు అతని వయస్సు కేవలం 13 ఏళ్లు మాత్రమే, కానీ అతని ప్రతిభ అంతకు మించినది. 13 ఏళ్ల వయసులో రాజస్థాన్ జట్టుకు ఎంపికైన వైభవ్, ఐపీఎల్ హిస్టరీలో అత్యంత పిన్న వయసులో అమ్ముడైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ తర్వాత 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి, ఐపీఎల్ ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.
66
భారత్-ఏ, అండర్-19లోనూ వైభవ్ సూర్యవంశీ మెరుపులు
ఐపీఎల్ 2025 తర్వాత కూడా వైభవ్ జోరు కొనసాగింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అండర్-19 జట్టుతో కలిసి అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అతన్ని ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో కూడా తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. యూఏఈపై అతను అద్భుతమైన సెంచరీ సాధించాడు.
ఇక దేశవాళీలో రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీని బీహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు. రంజీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో మహారాష్ట్రపై 61 బంతుల్లో అజేయంగా 108 పరుగులు చేసి, తాను భవిష్యత్తు స్టార్‌నని మరోసారి నిరూపించుకున్నాడు.