32 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఏకంగా యూనివర్స్ బాస్‌కే చెమటలు పట్టించిన వైభవ్

Published : Nov 14, 2025, 06:57 PM IST

రాజస్థాన్ రాయల్స్ తరపున ఎప్పుడైతే బరిలోకి దిగాడో.. అప్పటి నుంచి క్రికెట్ చరిత్రలో తనకంటూ పేజీలు లిఖించుకుంటూ వస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ప్రస్తుతం ఇండియా ఏ తరపున బరిలోకి దిగిన ఈ బుడ్డోడు..  

PREV
15
వైభవ్ ఖాతాలో మరో రికార్డు..

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించాడు. దోహా వేదికగా జరుగుతోన్న 2025 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో ఇండియా A తరపున ఆడుతున్న వైభవ్.. 32 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. UAEతో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌలర్ల ఊచకోత కోశాడు. ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన వైభవ్ 17 బంతుల్లో తన ఫిఫ్టీని పూర్తి చేయడం గమనార్హం. ఆపై తన తదుపరి యాభై పరుగులను కేవలం 15 బంతుల్లోనే పూర్తి చేశాడు. తద్వారా సెంచరీ చేరుకోవడానికి 10 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు.

25
టీ20లలోనే ఫాస్టెస్ట్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటి. అభిషేక్ శర్మ, ఉర్విల్ పటేల్ సంయుక్తంగా 28 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి వైభవ్ కంటే ముందు వరుసలో ఉన్నారు. అటు ఈ సంవత్సరం ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా సూర్యవంశీ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల 32 రోజుల వయసులో అతడు కేవలం 35 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది రెండవ వేగవంతమైన సెంచరీ.

35
అత్యంత వేగవంతమైన సెంచరీ వీరులు..

భారత్ తరఫున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ సాధించిన ఆటగాళ్లు వీరు. అత్యంత వేగవంతమైన T20I సెంచరీ రికార్డులో అభిషేక్ శర్మ, ఉర్విల్ పటేల్ మొదటి స్థానంలో నిలిచారు. వారిద్దరూ 28 బంతుల్లో సెంచరీలు సాధించారు. రిషబ్ పంత్ కూడా 32 బంతుల్లో T20 క్రికెట్‌లో సెంచరీ సాధించగా.. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా 32 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి ఆ జాబితాలో చేరాడు. ఇదిలా ఉంటే.. పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ నవంబర్ 14న ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 40 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది.

45
బౌలర్ల ఊచకోత..

బరిలోకి దిగిన దగ్గర నుంచి వైభవ్ సూర్యవంశీ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 11 బంతుల్లోనే 36 పరుగులు చేసిన వైభవ్.. అత్యధికంగా బౌండరీల రూపంలోనే పరుగులు రాబట్టాడు. అలాగే ఒకే ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు చేశాడు వైభవ్.. నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ బాదిన వైభవ్.. చివరిలో రెండు పరుగులు చేసి.. మొత్తంగా 30 పరుగులు ఓ ఓవర్‌లో చేశాడు.

55
200 పరుగులకు అతిచేరువలో..

ఒకానొక సమయంలో వైభవ్ సూర్యవంశీ జోరు చూస్తే.. డబుల్ సెంచరీ చాలా ఈజీ అని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఓ వీడియో గేమ్ మాదిరిగా సిక్సర్లు, ఫోర్లు కొట్టి.. ఏకంగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్‌కే చెమటలు పట్టించాడు. ఎందుకని అనుకుంటున్నారా.? క్రిస్ గేల్.. రాయల్ ఛాలెంజర్స్ తరపున బరిలోకి దిగి.. 175 పరుగులు సాధించాడు. ఇక వైభవ్ కూడా అదే జోరు చూపిస్తుంటే.. కచ్చితంగా ఆ రికార్డు బద్దలవుతుందని అనుకున్నారు. అయితే చివర్లో 42 బంతుల్లో 15 సిక్సర్లు, 11 ఫోర్లతో 144 పరుగులు చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories