Top 5 Bowlers in T20I : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనోడే టాప్ !

Published : Jan 05, 2026, 04:18 PM IST

Top 5 Bowlers in ICC T20I Bowling Rankings : 2026 ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో నిలిచాడు. రషీద్ ఖాన్, హసరంగ వంటి స్టార్ బౌలర్లతో కూడిన టాప్ 5 జాబితా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి హవా.. టాప్ 5లో ఉన్నది వీరే!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి పురుషుల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బౌలర్లను వెనక్కి నెట్టి వరుణ్ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం భారత క్రికెట్‌కు గర్వకారణం. ఇక టెస్టులలో బుమ్రా టాప్ లో ఉన్నాడు.

వరుణ్ చక్రవర్తి నుండి పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ వరకు, ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న టాప్ 5 బౌలర్ల వివరాలు గమనిస్తే..

26
1. వరుణ్ చక్రవర్తి (భారత్) : నెంబర్ 1 స్థానం

భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. తాజా చార్ట్‌లో అతను ఏకంగా 804 పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న వరుణ్, అంతర్జాతీయంగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

వరుణ్ చక్రవర్తి తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను 14.87 బౌలింగ్ సగటుతో మొత్తం 55 వికెట్లు పడగొట్టాడు. అతని కెరీర్ గణాంకాలలో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. ఈ గణాంకాలే అతన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్‌గా నిలబెట్టాయి.

36
2. జాకబ్ డఫీ (న్యూజిలాండ్) : రెండో స్థానం

న్యూజిలాండ్ పేస్ బౌలర్ జాకబ్ డఫీ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తన వేగం, పదునైన బౌలింగ్ తో బ్యాటర్లను బోల్తా కొట్టించే డఫీ, తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 699 పాయింట్లు సాధించాడు. అగ్రస్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తికి గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

జాకబ్ డఫీ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను 17.05 బౌలింగ్ సగటుతో 53 వికెట్లు తీశాడు. కివీస్ జట్టు బౌలింగ్ విభాగంలో డఫీ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఈ ర్యాంకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

46
3. రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) : మూడో స్థానం

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఎప్పటిలాగే తన సత్తా చాటాడు. తాజా జాబితాలో రషీద్ 694 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో, అంతర్జాతీయ మ్యాచ్‌లలో రషీద్ ఖాన్ సుదీర్ఘ కాలంగా నిలకడగా రాణిస్తున్నాడు.

టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ కు అపారమైన అనుభవం ఉంది. అతను ఇప్పటివరకు 108 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 13.69 అనే అద్భుతమైన బౌలింగ్ సగటుతో ఏకంగా 182 వికెట్లు పడగొట్టాడు. అతని రికార్డుల్లో తొమ్మిది సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన, రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.

56
4. అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్) : నాలుగో స్థానం

పాకిస్థాన్‌కు చెందిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. తన విభిన్నమైన బౌలింగ్ శైలితో గుర్తింపు పొందిన అబ్రార్, తాజా ర్యాంకింగ్స్‌లో 691 పాయింట్లు సాధించాడు. తక్కువ కాలంలోనే అతను ఈ ఘనత సాధించడం గమనార్హం.

అబ్రార్ అహ్మద్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 18.91 బౌలింగ్ సగటుతో 37 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్ విభాగంలో అబ్రార్ కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు.

66
5. వనిందు హసరంగ (శ్రీలంక) : ఐదో స్థానం

శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించగల హసరంగ, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 687 పాయింట్లు సాధించాడు. టాప్ 5 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో హసరంగ ఇప్పటివరకు 90 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో అతను 15.86 బౌలింగ్ సగటుతో 146 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక జట్టు విజయాల్లో హసరంగ బౌలింగ్ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories