వీరిలో 68 మంది పురుష అథ్లెట్లు కాగా, మిగిలిన 52 మంది మహిళా అథ్లెట్లు. వీరిలో మెన్స్ స్కీట్ షూటింగ్‌లో పాల్గొంటున్న 45 ఏళ్ల మైరాజ్ అహ్మద్ ఖాన్, భారత బృందంతో అతి పెద్ద వయస్కుడు. అహ్మద్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు అథ్లెట్లు 40+ వయసులో ఒలింపిక్స్ బరిలో దిగుతున్నారు.
undefined
రైఫెల్ 3 పొజిషన్‌లో పోటీపడుతున్న తేజస్వినీ పండిత్, సంజీవ్ రాజ్‌పుత్ ఇద్దరి వయసు 40 ఏళ్లు... భారత సీనియర్ టేబుల్ టెన్నిస్ స్టార్ 39 ఏళ్ల వయసులో పోటీపడుతుండగా, 18 ఏళ్ల రైఫెల్ షూటర్ దివ్యాంవ్ సింగ్ పన్వార్, భారత బృందంతో చిన్న వయస్కుడు.
undefined
పిస్టల్ షూటర్లు మను బకర్, సౌరబ్ చౌదరీల వయసు 19 ఏళ్లు. ఒలింపిక్స్ ఆరంభవేడుకల్లో జరిగే మార్చ్‌లో భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ భారత పతకాన్ని చేతపట్టనున్నారు.
undefined
భారత ఆర్చరీ మహిళా జట్టు ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఆర్చరీలో వరల్డ్ నెం.1 దీపికా కుమారి మాత్రమే బరిలో దిగుతోంది. ఆమెతో పాటు మరో ముగ్గురు పురుష ఆర్చర్లు తురుణ్‌దీప్ రాయ్, అథాను దాస్, ప్రవీణ్ జాదవ్ ఒలింపిక్ బరిలో నిలిచారు.
undefined
జిమ్మాస్టిక్స్‌లో భారత్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ అర్హత సాధించింది. ప్రణతి నాయక్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ పోటీలో బరిలో దిగుతోంది.
undefined
అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి 8 మంది మహిళా అథ్లెట్లు (డ్యూటీ చంద్, కమల్‌ప్రీత్ కౌర్, సీమా పూనియా, అన్నూ రాణి, భావన జత్, ప్రియాంక, రేవతి వీరమణి, సుబా వెంకటేశన్), 17 మంది పురుష అథ్లెట్లు (నీరజ్ చోప్రా, శివ్‌పాల్ సింగ్, శ్రీశంకర్, జబీర్, అవినాశ్ ముకుంద్ సబల్ సహా) బరిలో దిగుతున్నారు.
undefined
బ్యాడ్మింటన్‌లో పీవీ సింధుతో పాటు బీ సాయి ప్రణీత్, చిరాగ్ శెట్టి, సాత్విక్ రాంకీ రెడ్డి ఒలింపిక్స్‌లో బరిలో దిగుతున్నారు...
undefined
బాక్సింగ్‌లో పురుషుల్లో ఐదుగురు (అమిత్ పంగల్, మనీశ్ కౌశిక్, వికాస్ కృష్ణన్ యాదవ్, అశీష్ కుమార్, సతీశ్ కుమార్), మహిళల్లో నలుగురు (మేరీ కోమ్, సిమ్రాన్ జిత్ కౌర్, లోలీనా బోర్గోహిన్, పూజా రాణి) పతక వేటలో ఉన్నారు.
undefined
ఫెన్సింగ్స్‌లో భవానీ దేవీ, ఈక్వేస్ట్రేయిన్‌లో ఫిరోజ్ మీర్జా, హాకీలో 16మందితో కూడిన రెండు జట్లు (మొత్తంగా 32 మంది)పోటీపడబోతున్నాయి.
undefined
గోల్ఫ్‌లో అనీర్బన్ లహిరి, ఉదయన్ మానే, అదితి అశోక్ (వుమెన్), జూడోలో సుశీల దేవి లిక్మబం (మహిళ 48 కేజీ), రోయింగ్‌లో జత్ అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ బరిలో దిగుతున్నారు.
undefined
సెయిలింగ్‌లో విష్ణు శరవణన్, కేజీ గణపతి, వరుణ్ తక్కర్, నేత్రా కుమారన్ (మహిళ) ఒలింపిక్ బరిలో ఉన్నారు.
undefined
షూటింగ్‌లో 15 మంది (దీపక్ కుమార్, దివ్యాష్ సింగ్ పన్వార్, సంజీవ్ రాజ్‌పుత్, ప్రతాప్ సింగ్ తోమర్, సౌరబ్ తివారి, అభిషేక్ వర్మ, వీర్ సింగ్ భజ్వా, మైరాజ్ అహ్మద్ ఖాన్ - పురుషులు, అపూర్వీ చండేలా, ఎలవెనిల్ వలరివన్, అంజుమ్ మౌండగ్లిల్, తేజస్వినీ సావత్, మను బకర్, యశస్వి సింగ్, రాహి సర్వోనత్ - మహిళలు) బరిలో దిగుతున్నారు.
undefined
రెజ్లింగ్‌లో ఏడుగురు (సీమా బిస్లా, వినేశ్ ఫోగట్, అన్షు మాలిక్, సోనమ్ మాలిక్ - మహిళలు, రవి కుమార్, భజరంగ్ పూనియా, దీపక్ పూనియా - పురుషులు) పోటీపడుతున్నారు
undefined
వెయిట్ లిఫ్టింగ్‌లో ఒకే ఒక్క మహిళ మీరాభాయ్ ఛాను సాయికోమ్ 49 కేజీల విభాగంలో పోటీ పడనుంది.
undefined
టెన్నిస్‌లో ముగ్గురు (సానియా మీర్జా, అంకితా రైనా, సుమిత్ నగల్ (పురుషుడు) ఒలింపిక్స్‌లో పోటీ పడనున్నారు.
undefined
టేబుల్ టెన్నిస్‌లో నలుగురు (శరత్ కమల్, జ్ఞానశేఖరన్- పురుషులు, మానిక బత్రా, సుత్రికా ముఖర్జీ- మహిళలు) ఒలింపిక్స్‌లో టీమిండియా తరుపున బరిలో దిగుతున్నారు.
undefined
స్విమ్మింగ్‌లో ముగ్గురు (మాన పటేల్ (మహిళ), సజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజన్) బరిలో దిగుతున్నారు.
undefined