ఆట ప్రారంభమైన ఏడో నిమిషంలో గోల్ చేసిన దిల్‌ప్రీత్ సింగ్, భారత జట్టుకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత రెండో క్వార్టర్ మొదలైన కొద్దిసేపటికే 16వ నిమిషంలో హార్ధిక్ సింగ్ అందించిన బంతిని, గోల్‌గా మలిచిన గుర్జంత్ భారత జట్టుకి 2-0 తేడాతో మంచి ఆధిక్యం అందించాడు.
మొదటి రెండు క్వార్టర్స్‌లో ప్రత్యర్థికి గోల్ ఇవ్వని టీమిండియా, 45వ నిమిషంలో సామ్ వార్డ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 2-1 తేడాతో తగ్గించాడు.
ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌కి ఆరు పెనాల్టీ కార్నర్స్ లభించినప్పటికీ భారత డిఫెండర్లు అద్భుతంగా ప్రత్యర్థిని గోల్ చేయకుండా అడ్డుకున్నారు. 57వ నిమిషంలో గోల్ చేసిన హార్ధిక్ సింగ్, భారత్ ఆధిక్యాన్ని 3-1 తేడాకి పెంచాడు. మూడు నిమిషాల పాటు ఆధిక్యాన్ని కాపాడుకుని, సెమీస్‌కి దూసుకెళ్లింది భారత పురుషుల హాకీ జట్టు.
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు, సెమీస్‌కి అర్హత సాధించింది. సెమీ ఫైనల్‌లో బెల్జియంతో తలబడనుంది భారత జట్టు.
అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది...