అతని వల్లే ఫుట్‌బాల్‌ వదిలి టెన్నిస్‌ రాకెట్ పట్టిన రాఫెల్ నాదల్... స్పెయిన్ బుల్ బెస్ట్ కొటేషన్స్ ఇవే..

Published : Jun 03, 2022, 12:32 PM IST

టెన్నిస్ ప్రపంచంలో లెజెండ్‌గా ఎదిగాడు స్పెయిల్ బుల్ రాఫెల్ నాదల్. రికార్డు స్థాయిలో 21 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మెన్స్ ప్లేయర్‌గా నిలిచిన రాఫెల్ నాదల్, నేడు 36వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు... టెన్నిస్ ప్రపంచంలో రికార్డులు సృష్టిస్తూ, ‘క్లే కోర్టు కింగ్’గా పేరు తెచ్చుకున్నప్పటికీ రఫెల్ నాదల్, చిన్నతనంలో ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కన్నాడట...

PREV
110
అతని వల్లే ఫుట్‌బాల్‌ వదిలి టెన్నిస్‌ రాకెట్ పట్టిన రాఫెల్ నాదల్... స్పెయిన్ బుల్ బెస్ట్ కొటేషన్స్ ఇవే..
Rafael Nadal

రాఫెల్ నాదల్ తండ్రి సెబాస్టియన్ నాదల్‌కి ఇద్దరు తమ్ముళ్లు. మిగ్యూల్ నాదల్, టోనీ నాదల్ ఇద్దరూ కూడా ఫుట్‌బాల్‌లో ప్రొఫెషనల్ ప్లేయర్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాబాయిలను చూస్తూ పెరిగిన రాఫెల్ నాదల్ కూడా చిన్నతనంలో ఫుట్‌బాల్ ఆటనే ఎక్కువ ఇష్టపడేవాడట...

210
Image Credit: Rafael Nadal Instagram

అయితే టోనీ నాదల్, రాఫెల్ నాదల్‌లోని మణికట్టు మ్యాజిక్‌ని గుర్తించి, ఈ బుడ్డోడు ఫుట్‌బాల్ ప్రపంచంలో కాదు టెన్నిస్‌ ప్రపంచాన్ని ఏలుతాడని ముందుగానే పసిగట్టాడట. అందుకే మూడేళ్ల వయసు నుంచి టెన్నిస్ రాకెట్‌తో శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడట...

310
Image Credit: Getty Images

టెన్నిస్ కోర్టులో కాకుండా ఎర్రమట్టిలో ఎక్కువగా ఆడించేవాడట టోనీ. దాంతో ఎర్రమట్టి కోర్టులో ఆడడం అలవాటైన రాఫెల్ నాదల్, క్లే కోర్టులో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని 13 సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు...

410
Image Credit: Getty Images

రాఫెల్ నాదల్‌కి సెంటిమెంట్స్ ఎక్కువే. ప్రతీ మ్యాచ్‌కి ముందు చన్నీటి స్నానం చేసే రాఫెల్ నాదల్, ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్నప్పుడు మాత్రం లాకర్ నెంబర్ 159ని వాడతాడు...

510

అలాగే రాఫెల్ నాదల్‌కి కాస్త ఓసీడీ ఎక్కువ. ఏదీ శుభ్రంగా లేకపోయినా నాదల్‌కి నచ్చదు. ఆఖరికి నీళ్లు తాగే వాటర్ బాటిల్స్ కూడా వరుస క్రమంలో ఉండాల్సిందే. లేదంటే వరుసగా పేర్చిన తర్వాత నీళ్లు తాగుతాడు.. 

610
Rafael Nadal

రాఫెల్ నాదల్‌కి 23 ఏళ్లు ఉన్న సమయంలో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయారు. కెరీర్ ఆసాంతం గాయాలతో యుద్ధం చేస్తూ పోరాడుతూనే విజయాలు అందుకుంటూ వచ్చిన రాఫెల్ నాదల్ మంచి టెన్నిస్ ప్లేయర్ మాత్రమే కాదు, అద్బుతమైన కొటేషన్ మేకర్ కూడా... రాఫెల్ నాదల్ చెప్పిన కొటేషన్లలో కొన్ని పాపులర్ కోట్స్ ఇవి...

710
Image Credit: Getty Images

‘ప్రజలు కొన్నిసార్లు వినయాన్ని కూడా వ్యాపారంగా వాడతారు. మీరు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు లేకపోయినా ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఏమీ మారదు..’ - రాఫెల్ నాదల్

810
Rafael Nadal

‘ఓటమిని నవ్వుతూ స్వీకరించే సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు లేదు...’, ‘ఓటమి నాకు శత్రువు కాదు, ఓడిపోతానేమో అనే భయమే నాకు అసలైన శత్రువు...’ - రాఫెల్ నాదల్

910
Rafael Nadal

‘మీరేం సాధించినా మీ డెడికేషన్‌ని పొడుగుకోండి. ఎందుకంటే అది లేకుండా మీ సొంతంగా ఏదీ గెలవలేరు..’ - రాఫెల్ నాదల్

1010

‘అనుమానాలు, సందేశాలు అనేవి జీవితంలో మంచివే. ఎందుకంటే అనుమానాలు, సందేహాలు లేని జనాల్లో రెండే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి కోపం లేదా తెలివితక్కువ తనం...’ - రాఫెల్ నాదల్

click me!

Recommended Stories