వాళ్లు కోతుల్లా ఎగురుతుంటే చూడడానికి బాగుంటుంది... షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు...

Published : Jun 03, 2022, 11:56 AM IST

క్రికెట్ ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేరిటే ఉంది. 2003 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేసిన అక్తర్, బ్యాట్స్‌మెన్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు... 

PREV
17
వాళ్లు కోతుల్లా ఎగురుతుంటే చూడడానికి బాగుంటుంది... షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు...

రాకాసి బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెట్టే షోయబ్ అక్తర్, ప్రత్యర్థి బ్యాటర్లను తినేసేలా గుడ్లు ఉరిమి చూసేవాడు. ఈ బిహేవియర్ కారణంగానే అక్తర్‌ అంటే చాలా మందికి పడేది కాదు...

27
Shoaib Akhtar

‘నాకు బ్యాటర్లు కోతుల్లా ఎగురుతుంటే చూడడం అంటే బాగా ఇష్టం. అందుకే బౌన్సర్లు వేసి వారిని ఎగిరేలా చేసేవాడిని. ఇందులో అబద్దం ఆడాల్సిన పని లేదు...

37
Shoaib Akhtar

నేను ఎప్పుడూ బ్యాటర్ల తల పగలకొట్టాలనే ఉద్దేశంతోనే బౌన్సర్లు వేసేవాడిని. నా బౌలింగ్‌లో అలాంటి పేస్ ఉండేది. ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నప్పుడు  ఈ కసి చాలా అవసరం...

47

బౌలింగ్ చేసేటప్పుడు నా గుండె వేగం 185 దాటేసేది. గాలి వేగానికి నా జట్టు ఎగురుతూ ఉండేది. అప్పుడే ఫుల్లర్ కాకుండా బాడీకి తగిలేలా బంతులు వేయగలం...
 

57

నేను వేసిన బాల్ తగిలితే వాపు రావాల్సిందే. అద్దంలో చూసుకున్న ప్రతీసారి నేను గుర్తుకు రావాలి... అదే నిజమైన ప్రేమ...’ అంటూ కామెంట్లు చేశాడు షోయబ్ అక్తర్...
 

67

పాకిస్తాన్ తరుపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, వన్డేల్లో 247, టెస్టుల్లో 178, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు..

77

గాయాలతో సతమతమవుతూ సుదీర్ఘ కెరీర్ కొనసాగించలేకపోయిన షోయబ్ అక్తర్, రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యతగానూ వ్యవహరించాడు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేస్తూ సంచలన వ్యాఖ్యలతో వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు... 

Read more Photos on
click me!

Recommended Stories