Paris Paralympics 2024 bronze medal winner Deepthi jeevanji : రెక్కాడితే గానీ డొక్కాడని కడుపేద కుటుంబం. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు. తోటి గ్రామస్తులచే 'కోతి, మెంటల్' అంటూ తక్కువ చూపు.
అయినా వాటన్నింటికీ ఎదురునిలిచి.. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది తెలంగాణ బిడ్డ. ప్రపంచ వేదికపై ఛాంపియన్ గా నిలిచింది. భారత కీర్తిని మరింత పెంచింది. ఆమె దీప్తి జివాంజి.
పారిస్ పారాలింపిక్స్ 2024 లో తన సత్తాను ప్రపంచానికి మరోసారి చూపించింది దీప్తి జివాంజి. ఈ అథ్లెట్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటికి ఎదురునిలిచి పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల T20 ఫైనల్‌లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవన్‌జీ భారత్‌కు 16వ పతకాన్ని అందించింది. పారా అథ్లెట్ రేసును 55.82 సెకన్లలో ముగించింది.
Deepthi jeevanji, Deepthi jeevanji success story, paralympic games 2024
ఎవరీ దీప్తి జీవాంజీ?
జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ పారా ఛాంపియన్‌షిప్‌లో దీప్తి జీవాంజీ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. రోజువారి పనిచేస్తే గానీ ముందుకు సాగని కడుపేద కుటుంబం.
పేదరికంతో మగ్గివున్న కుటుంబ ఆర్థికస్థితి, మరోవైపు మానసిక లోపం సమస్య. సొంత గ్రామస్తుల నుంచే ఎన్నో ఇబ్బందులు.. అవమానాలు. అయినా వాటికి ఎదురునిలిచి సమస్యల సుడిగుండం నుంచి బయటకు వచ్చింది. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అకుంఠిత దీక్షతో ప్రపంచ భారత్ గర్వించదగ్గ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.
Deepthi jeevanji, Deepthi jeevanji success story, paralympic games 2024
దీప్తి జీవాంజీ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకమైన కథ
దీప్తి గొప్ప పోరాటంతో ఎదిగిన అథ్లెట్లలో ఒకరు. ఆమె తల్లిదండ్రులు జీవాంజీ యాదగిరి, ధనలక్ష్మిలు రోజువారి కూలిపని చేస్తారు. తమ కుమార్తె పెరుగుతున్నప్పుడు అవహేళనలను ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో గుర్తు చేసుకున్నారు.
దీప్తి మేధో వైకల్యంతో జన్మించింది, ఒక అభిజ్ఞా వ్యాధి కమ్యూనికేషన్‌కు ఆటంకం కలిగిస్తుంది. "ఆమె సూర్యగ్రహణం సమయంలో జన్మించింది. పుట్టినప్పుడు ఆమె తల చాలా చిన్నది, పెదవులు-ముక్కు కొంచెం అసాధారణంగా ఉన్నాయి..
Deepthi jeevanji, Deepthi jeevanji success story, paralympic games 2024
ఆమెను చూసిన ప్రతి గ్రామస్థుడు, మా బంధువులు కొందరు దీప్తిని పిచ్చిది, మెంటల్ (మానసిక రోగి), కోతి (కోతి) అని పిలిచి ఆమెను అనాథాశ్రమానికి పంపమని చెప్పారు. ఈ రోజు ఆమె సుదూర దేశంలో ప్రపంచ ఛాంపియన్‌గా మారడం చూస్తుంటే ఆమె నిజంగా ప్రత్యేకమైన అమ్మాయి అని రుజువు చేస్తుంది" అని దీప్తి తల్లి జీవాంజీ ధనలక్ష్మి చెప్పినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
అలాగే, "నా భర్త తండ్రి చనిపోవడంతో మేం బతుకుదెరువు కోసం పొలం అమ్ముకోవాల్సి వచ్చింది.. నా భర్త రోజుకు రూ. 100 లేదా రూ. 150 సంపాదించేవాడు కాబట్టి దీప్తి చెల్లెలు అమూల్యతో సహా మా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను కూలి పనులు చేయాల్సిన రోజులు వచ్చాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దీప్తి.. చాలా తక్కువగా మాట్లాడేది. కానీ పిల్లలు ఆమెను ఆటపట్టించడంతో ఆమె ఇంటికి వచ్చి ఏడ్చేది. అప్పుడు నేను తనను దగ్గరకు తీసుకుని తినిపిస్తే ఏడుపు ఆపేది" అని చెప్పారు.
Deepthi jeevanji, Deepthi jeevanji success story, paralympic games 2024
దీప్తి జీవాంజీ 2023 పారా ఆసియా గేమ్స్ లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. 400 మీటర్లను 56.69 సెకన్లలో రేసు పూర్తి చేసి ఆసియా రికార్డును సాధించింది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో దీప్తి టీ20, 400 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ గెలిచింది.
దీప్తి గెలుచుకున్న తొలి అంతర్జాతీయ మెడల్ ఇది. అలాగే, 200 మీటర్లలోనూ తన సత్తా చాటింది. 2022లో బ్రిస్బేన్ లో జరిగిన వర్చుస్ ఆసియానియా పోటీల్లో 200 మీటర్ల రేసును 26.82 సెకన్లలో పూర్తిచేసి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. అలాగే, 400 మీటర్ల రేసును 57.58 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించింది.