హైదరాబాద్ : ఏషియన్ గేమ్స్ 2023 లో భారత ఆటగాళ్లు పతకాల పంట పండిస్తున్నారు. చైనా వేదికన జరుగుతున్న ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో షూటర్లు పతకాల వేట ప్రారంభిస్తే దాన్ని మిగతా ఆటగాళ్ళు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆడబిడ్డలు కూడా అదరగొట్టి భారత్ కు పతకాలు అందించారు. ఇలా అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన తెలంగాణ ఆడబిడ్డలు నిఖత్ జరీన్, అగసర నందిని యావత్ దేశప్రజలచే కొనియాడబడుతున్నారు.