Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?

Published : May 20, 2026, 02:49 PM IST

Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ మానసిక సమస్యతో బాధపడుతున్నారట… అదే ఇంపోస్టర్ సిండ్రోమ్. అసలు ఇది ఎలాంటి మెంటల్ సమస్య… దీని లక్షణాలేంటి..? దీనివల్ల కోహ్లీ ఎలా బాధపడుతున్నాడు..?

PREV
14
కింగ్ కోహ్లీకి మానసిక సమస్య...

Imposter Syndrome : విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ టీమిండియా స్టార్ క్రికెటర్ ను లెజెండరీ సచిన్ టెండూల్కర్ తో పోలుస్తుంటారు... దీన్నిబట్టే అతడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే... రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఇప్పటికే వేల పరుగులు, వందకు చేరువలో సెంచరీలు, హాఫ్ సెంచరీలతో ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు... ఆర్సిబికి ట్రోఫీని అందించేవరకు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. అద్భుతమైన ఆటతీరుతో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే కోహ్లీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెడతాడు... ఈ విషయం అతడి పిట్ నెస్ ను చూస్తేనే అర్థమవుతుంది. ఆరోగ్యపరంగా అతడికి ఎలాంటి సమస్యలు లేకున్నా మానసికంగా సమస్యలు ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీయే బైటపెడ్డాడు. ఇంతకీ కోహ్లీ ఏ సమస్యతో బాధపడుతున్నాడు..? దీని లక్షణాలేంటి..? ఇది ప్రమాదకరమైందా..? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

24
కోహ్లీకి ఇంపోస్టర్ సిండ్రోమ్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కొనసాగుతున్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ''RCB Innovation Lab'' పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండియాలో క్రీడాకారులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్సిబి ఫ్రాంచైజీ దీన్ని చేపడుతోంది... తాజాగా బెంగళూరులో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మానసిక సమస్య గురించి బైటపెట్టారు.

టీమిండియాతో తరపున అంతర్జాతీయ క్రికెట్లో... ఆర్సిబి తరపున ఐపిఎల్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా టాప్ లెవల్‌లో ఆడుతున్నా కొన్నిసార్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని కోహ్లీ తెలిపాడు. ఎంత అద్భుతంగా ఆడినా ఏదో భయం వెంటాడుతోంది... తనను తాను తక్కువగా అంచనా వేసుకునే వింత మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. దీన్నే Imposter Syndrome (ఇంపోస్టర్ సిండ్రోమ్) అంటారు.

34
ఏమిటీ ఇంపోస్టర్ సిండ్రోమ్..?

స్టార్ క్రికెటర్ కోహ్లీ ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నట్లు చెప్పడంతో అసలు ఇదేమిటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇది ఒక మానసిక సమస్య... బాగా టాలెంటెడ్ వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. తాము ఎంత ప్రతిభావంతులైనా, ఎన్ని విజయాలు సాధించినా వీరికి సంతృప్తి ఉండదు... ఏదో వెలితి ఉన్నట్లు భావిస్తారు. తమను తామే నమ్మలేరు... ఎప్పుడూ తక్కువగా అంచనా వేసుకుంటారు.

తమ విజయాలకు సొంత ప్రతిభ కారణం కాదని... కేవలం అదృష్టం వల్లనో లేక మరేదైనా కారణంతోనే వచ్చిందని తక్కువచేసుకుంటారు. ప్రశంసలను ఆస్వాదించలేరు... పొగిడినా ఆనందించరు. తనకు టాలెంట్ లేదని బయటపడితే ఎలా..? అంటూ బాధపడుతుంటారు. ఇలా ఇంపోస్టర్ సిండ్రోమ్ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని... కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని మానసిన నిపుణులు చెబుతున్నారు.

44
కోహ్లీకి మనోధైర్యం ఇచ్చింది ఈయనే...

''ఒక క్రికెటర్‌గా ఆత్మవిశ్వాసానికి, ఆత్మన్యూనతకు మధ్య సన్నని గీతపై నడుస్తుంటాం. మనం ఎంత సాధించినా అది సరిపోలేదనిపిస్తుంది. దీన్నే 'ఇంపోస్టర్ సిండ్రోమ్' అంటారని కోహ్లీ వివరించారు. అది ఎప్పుడూ తనను వెంటాడుతూ ఉంటుందని అన్నాడు.

''ఈ రోజుకీ నెట్స్‌కి వెళ్లినప్పుడు, కొత్తవాళ్లు నా ఆటను చూస్తున్నారని అనుకుంటాను. ఒకవేళ నేను సరిగ్గా ఆడకపోతే 20 ఏళ్లుగా ఆడుతున్న ప్లేయర్ ఇతనేనా? అని వాళ్లు అనుకుంటారేమోనని నాలో నేనే మధనపడతాను' అంటూ కోహ్లీ తన సమస్య గురించి వివరించాడు.

అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు మానసికంగా దృఢంగా ఉండేందుకు తనకు చాలా సాయం చేశారని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. ముఖ్యంగా 2020-2022 మధ్య కెప్టెన్‌గా ఉన్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోయానని చెప్పాడు. ''రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ నా మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నారు. నా ఆటను నేను ఆస్వాదించేలా చేశారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు 'నువ్వు ఎలా ఉన్నావ్?' అని నన్నెవరూ అడగలేదు. అందుకే యువ ఆటగాళ్లు పని ఒత్తిడిని అర్థం చేసుకుని, హద్దులు తెలుసుకోవాలి' అని కోహ్లీ సలహా ఇచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories