T20 World Cup 2026 ముందే ప్రత్యర్థులకు టీమిండియా బిగ్ వార్నింగ్.. సూర్య అప్డేట్ అదిరిపోయిందిగా !

Published : Feb 01, 2026, 06:46 PM IST

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత జట్టుకు శుభవార్త అందింది. స్టార్ ప్లేయర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో మెగా టోర్నీకి ముందు భారత్ బలం మరింతగా పెరిగింది.

PREV
15
తిలక్ వర్మ రీఎంట్రీ ఫిక్స్.. కెప్టెన్ సూర్య క్లారిటీతో ప్రత్యర్థులకు వణుకు

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న తరుణంలో భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్ వచ్చింది. జట్టులోని కీలక ఆటగాళ్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సూర్య, వీరిద్దరి రాకతో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 7న అమెరికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఈ అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

25
తిలక్ వర్మ వచ్చేస్తున్నాడు !

ఎడమ చేతి వాటం బ్యాటర్ తిలక్ వర్మ గాయం కారణంగా గత కొంతకాలంగా మైదానానికి దూరంగా ఉన్నారు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన ఆయనకు జనవరిలో పొత్తికడుపు శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుండి ఆయన బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నారు. తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై సూర్య స్పందిస్తూ.. "తిలక్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. అతను ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ముంబైలో ఫిబ్రవరి 2, 4 తేదీల్లో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అతను ఆడబోతున్నాడు. ఆ రెండు మ్యాచ్‌లు అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సరిపోతాయి" అని పేర్కొన్నారు.

35
వాషింగ్టన్ సుందర్ కూడా వచ్చేస్తున్నాడు

ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం నుండి కోలుకుంటున్నట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. జనవరి 11న వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు సుందర్ పక్కటెముకలకు గాయమైంది. అయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఆయన బ్యాటింగ్ చేసి కేఎల్ రాహుల్‌తో కలిసి భారత్‌ను గెలిపించారు. ప్రస్తుతం ఆయన కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ లో ఉన్నారు. "వాషి ( వాషింగ్టన్ సుందర్) తో నేను మాట్లాడాను. అతను కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అతను చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, త్వరలోనే జట్టుతో చేరుతాడు" అని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు.

45
న్యూజిలాండ్ సిరీస్ విజయం.. ప్రపంచకప్ ముందు భారత్ కు బిగ్ బూస్ట్

భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటగా, సంజూ శామ్సన్ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ప్రపంచకప్ ముందే జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ సాధించడం సానుకూల అంశమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా ముంబైలో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

55
వరల్డ్ కప్ స్క్వాడ్‌లో సమతుల్యత

తిలక్ వర్మ టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌లో అత్యంత కీలకమైన ఆటగాడిగా ఎదిగారు. గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన తర్వాత ఆయన మళ్ళీ జట్టుకు అందుబాటులో లేరు. ఆయన తిరిగి రావడం వల్ల జట్టు సమతుల్యత పెరుగుతుందని సూర్య అభిప్రాయపడ్డారు. "తిలక్ వర్మ తిరిగి వచ్చినప్పుడు మా జట్టు మరింత బలంగా మారుతుంది. మేము అతని కోసం ఎదురుచూస్తున్నాం" అని సూర్య పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆటగాళ్లందరూ ముంబైలో సమావేశమై వరల్డ్ కప్ సన్నద్ధతలో స్పీడ్ పెంచనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories