ICC Men's T20 World Cup 2026 : ఐసిసి టీ20 వరల్డ్ కప్ టైటిల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై టీమిండియా పక్కా గెలవాల్సిందే. ఇంతటి కీలకమైన మ్యాచ్ లో భారత జట్టులోకి వచ్చేదెవరు? బైటకు వెళ్లేదెవరు..? తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం.
T20 World Cup 2026 : టీమిండియా ఇకపై కఠిన పరీక్షలు ఎదుర్కోనుంది. టీ20 వరల్డ్ కప్ ను విజయాలతో ప్రారంభించినా... ఒక్క ఓటమి.. కేవలం ఒకేఒక్క ఓటమి భారత జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. సూపర్-8 లో సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో భారత్ ఓడింది... దీంతో అన్ని సమీకరణలు మారిపోయాయి. టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ విజయంపై ఆశలు సజీవంగా ఉండాలంటే టీమిండియా ఇకపై ఆడే ప్రతిమ్యాచ్ గెలవాలి. అంటే ప్రతి మ్యాచ్ ఓ అగ్నిపరీక్షే... రేపు (ఫిబ్రవరి 26, గురువారం) జింబాబ్వేతో జరిగే మ్యాచ్ తో సహా. అందుకే జింబాబ్వేపై పక్కా వ్యూహాలతో బరిలోకి దిగబోతోంది... జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని కీలక ఆటగాళ్లను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
27
వైస్ కెప్టెన్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నాడు. చెన్నై స్పిన్ పిచ్‌పై సుందర్‌ను ఆడించాలనే వాదన ఉంది. కానీ జింబాబ్వే టాప్ ఆర్డర్‌లోని ఏడుగురిలో ఐదుగురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్ అవసరం అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి అక్షర్ పటేల్ రీఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
37
రింకూ స్ధానంలో బౌలర్ కు ఛాన్స్
ఫినిషర్‌గా విఫలమవుతున్న రింకూ గత ఐదు మ్యాచుల్లో రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 29 బంతులు ఎదుర్కొని కేవలం 24 పరుగులే చేశాడు. దీనికి తోడు తండ్రి అనారోగ్యం కారణంగా అతను హుటాహుటిన ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో రింకూ జింబాబ్వేతో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి రావచ్చు... లేదంటే పేసర్ మహ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించవచ్చు.
తక్కువ స్ట్రైక్ రేట్, ఇంటెంట్ లేదనే విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ వర్మకు రేపటి మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు. మూడో స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన తిలక్ స్థానంలో కుడిచేతి వాటం బ్యాటర్‌ను ఆడించాలని భావిస్తే, సంజూ శాంసన్ జట్టులోకి వస్తాడు. సంజూను మూడో నంబర్‌లో లేదా ఓపెనర్‌గా ఆడించవచ్చు. అతను ఓపెనింగ్ చేస్తే ఇషాన్ కిషన్ మూడో స్థానంలోకి వస్తాడు. ప్రత్యర్థుల ఆఫ్ స్పిన్ ఉచ్చును సంజూతో ఛేదించవచ్చని భారత్ ఆశిస్తోంది.
సంజూ శాంసన్ చివరిసారిగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సంజూ జట్టులోకి వస్తే ఓపెనింగ్‌లో కుడి-ఎడమ చేతి కాంబినేషన్‌ను ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
చెన్నై చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. రేపు జింబాబ్వేతో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌తో కూడిన స్పిన్ త్రయంపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. అంతేకాదు చెన్నై వరుణ్ చక్రవర్తికి హోమ్ గ్రౌండ్ కూడా. అందుకే అతడు చెలరేగిపోతాడని భావిస్తున్నారు.
67
బుమ్రా, అర్షదీప్ పేస్ అటాక్...
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇతర బౌలర్లు తేలిపోయినప్పటికీ, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌తో బౌలింగ్ చేశాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో కూడా బుమ్రా పాత్ర కీలకం కానుంది. అర్షదీప్ సింగ్ కూడా తుది జట్టులో ఉంటాడు. ఇంకా అవసరం అనుకుంటే సిరాజ్ ను కూడా ఆడించే అవకాశాలున్నాయి.