T20 World Cup 2026 : సూర్యకుమార్ 3 తప్పులే.. టీమిండియా కొంపముంచేశాయా..? సెమీస్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి..?

Published : Feb 23, 2026, 05:48 PM IST

T20 World Cup 2026: సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన తప్పులేంటి? ఈ ఓటమితో టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయా?  

PREV
15
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర పరాజయం

స్వదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 లో టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. గ్రూప్ దశలో విజయపరంపర కొనసాగించిన సూర్య సేన సూపర్-8 లొ మొదటి అడుగులోనే తడబడింది. సౌతాఫ్రికా చేతిలో ఏకంగా 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 

టాాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పరవాలేదనిపించారు… మిగతావాళ్ళంతా సఫారీ బ్యాటర్ల ముందు తేలిపోయారు. ఇక 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఏ దశలోనూ ఆ దిశగా అడుగులు వేయలేదు… బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమైంది.

ఇలా బౌలింగ్, బ్యాటింగ్ లోనే కాదు మ్యాచ్ కు ముందు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవడం కూడా టీమిండియా ఓటమికి కారణం. కీలక మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY), కోచ్ గౌతమ్ గంభీర్ లు చేసిన 3 ప్రధాన తప్పులేంటో ఇక్కడ చూద్దాం.

25
అక్షర్ పటేల్ ఎక్కడ?

ఆల్-రౌండర్, వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్‌ను ఈ మ్యాచ్‌లో తుది జట్టులోకి తీసుకోకపోవడం పెద్ద తప్పు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఓవర్లలో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. అక్షర్ పటేల్ ఉండుంటే మిడిల్ ఓవర్లలో కచ్చితంగా వికెట్ తీసి, బ్యాటింగ్‌లోనూ కొన్ని పరుగులు చేసేవాడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన సుందర్‌ను తీసుకుని, ఫామ్‌లో ఉన్న అక్షర్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాని ప్రశ్న.

35
బ్యాటింగ్ లైనప్‌లో మార్పు

ఈ టోర్నీ మొత్తం హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడాడు కూడా. కానీ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడిని 7వ స్థానంలో పంపారు. అతని స్థానంలో శివమ్ దూబే వచ్చాడు. ఈ మార్పు వల్ల ఇద్దరూ విఫలమయ్యారు. హార్దిక్ తన రెగ్యులర్ స్థానంలో ఆడి ఉంటే, కాసేపు క్రీజులో నిలబడి భారీ షాట్లు ఆడే అవకాశం ఉండేది.

45
అభిషేక్ శర్మకు మళ్లీ అవకాశం ఎందుకు?
అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయిన అభిషేక్ శర్మకు మళ్లీ అవకాశం ఇవ్వడం కూడా మరో తప్పు. అతను తన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది. అలాగే రింకూ సింగ్ కూడా పెద్దగా పరుగులు చేయలేదు. అతని బదులు కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే, అతను కొన్ని వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవాడు.
55
భారత్‌కు సెమీ ఫైనల్ అవకాశం ఉందా?

సౌతాఫ్రికాతో ఘోర ఓటమి టీమిండియా సెమీ ఫైనల్ దారిని కఠినతరం చేసింది. ప్రస్తుతం భారత జట్టు నెట్ రన్‌రేట్ -3.800తో చాలా దారుణంగా ఉంది. సెమీస్ చేరాలంటే మిగిలిన జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడే రన్‌రేట్ ప్లస్‌లోకి వస్తుంది. ఒకవేళ సౌతాఫ్రికా.. జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడిస్తే, ఇండియా మిగిలిన రెండు మ్యాచ్‌లలో మంచి రన్‌రేట్‌తో గెలిస్తే సరిపోతుంది. కానీ వెస్టిండీస్ లేదా జింబాబ్వే జట్లు సౌతాఫ్రికాను ఓడిస్తే, మూడు జట్లు 4 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్లే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఇది ఇండియాకు పెద్ద సవాల్.

Read more Photos on
click me!

Recommended Stories