తెలుగోడికి హ్యాండ్ ఇచ్చిన ఫ్రాంచైజీలు.. ఏంటి కావ్య పాప.! రూ. 75 లక్షలు కూడా లేవా..

Published : Dec 22, 2025, 10:15 AM IST

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 మినీ వేలం ఊహకందని విధంగా సాగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలా మంది స్టార్ ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలారు. తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. 

PREV
15
ఊహకందని మినీ వేలం

ఐపీఎల్ 2026 మినీ వేలం ఊహకందని విధంగా సాగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ వేలంలో అనేక మంది స్టార్ ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలిపోవడం విశేషం. ఫ్రాంచైజీలు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా హోంవర్క్ చేసి వచ్చినట్లు కనిపించాయి, డబ్బును ఏమాత్రం వృథా చేయడానికి ఇష్టపడడం లేదు.

25
తెలుగు ప్లేయర్ బేస్ ప్రైస్ చాలా తక్కువ..

ఈ అన్సోల్డ్ జాబితాలో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ కూడా ఉన్నారు. 75 లక్షల బేస్ ప్రైస్‌తో వికెట్ కీపర్ల జాబితాలో వేలంలోకి వచ్చిన శ్రీకర్ భరత్ కోసం ఏ జట్టు కూడా బిడ్ వేయలేదు. చివరికి సొంత ప్రాంతపు జట్టు అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బిడ్ వేయకపోవడంతో శ్రీకర్ భరత్ అన్సోల్డ్ గా మిగిలిపోయారు.

35
ఐపీఎల్ అనుభవం ఉన్నా..

శ్రీకర్ భరత్ టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడిన అనుభవం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున గతంలో చివరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్ గెలిపించిన రికార్డు కూడా ఇతనికి ఉంది. అయినా కూడా వేలంలో అతను ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయారు. దేశీయంగా అనుభవమున్న ప్లేయర్స్ ఎక్కువగా అన్ సొల్ద్ కావడం గమనార్హం.

45
తెలుగోడికి చుక్కెదురు..

సాధరణంగా ఏ ప్రాంతానికి చెందిన ఫ్రాంచైజీ.. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్లేయర్స్‌ను కొంతమందినైనా కొనుగోలు చేయాలి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మన తెలుగోడిని అస్సలు పట్టించుకోలేదు. మా అవసరం లేదన్నట్టు వదిలేసింది. గతంలోనూ ఈ మ్యాటర్‌పై చర్చ జరిగిన విషయం తెలిసిందే.

55
రూ. 75 లక్షలు కూడా లేవా..!

తెలుగోడు అమ్ముడవ్వకపోవడంతో అభిమానులు ట్విట్టర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఏకీపారేస్తున్నారు. ఏం కావ్య పాపా.! కనీసం రూ. 75 లక్షలు కూడా లేకపోలేదా.. తెలుగోడిని మినీ వేలంలో అస్సలు పట్టించుకోలేదుగా అని అంటున్నారు. అయితే రీప్లేస్ మెంట్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి.. ఐపీఎల్‌లోకి శ్రీకర్ భరత్ రావాలని అబిమానులు కోరుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories