SRH: ధోని కంబ్యాక్.! హైదరాబాద్ జట్టుకు రెండు గుడ్‌న్యూస్‌లు.. అవేంటంటే.?

Published : Apr 16, 2026, 06:44 PM IST

SRH: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్‌లు అందుతున్నాయి. ఈ నెల 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు..

PREV
15
సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే బ్యాడ్ న్యూస్ అందింది. ఇంగ్లాండ్‌కు చెందిన బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అతని కుడి చేతికి తీవ్రమైన గాయం కావడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతను టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

25
డేవిడ్ పయ్నే కూడా గాయం

ఇది జట్టు బౌలింగ్ విభాగానికి కొంత ప్రతికూల అంశమే అయినప్పటికీ, యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక ఇటీవల డేవిడ్ పయ్నే కూడా గాయంతో వైదొలిగాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది.

35
కొత్త ఆయుధం.. దిల్షాన్ మధుశంక ఎంట్రీ

గాయపడిన బ్రైడన్ కార్స్ స్థానంలో శ్రీలంకకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను ఎస్ఆర్‌హెచ్ ఎంచుకుంది. 75 లక్షల రూపాయల ధరకు మధుశంకను జట్టులోకి తీసుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న 25 ఏళ్ల ఈ యువ బౌలర్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న మధుశంక రాకతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది.

45
కమిన్స్ ఈజ్ బ్యాక్.. ఉప్పల్‌లో సందడి

సన్‌రైజర్స్ అభిమానులకు మరో అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, వెటరన్ పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరనున్నారు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటివరకు మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్, ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని 17వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, షాకిబ్ హుస్సేన్‌లకు కమిన్స్ అనుభవం తోడైతే సన్‌రైజర్స్ బౌలింగ్ అజేయంగా మారుతుందనడంలో సందేహం లేదు.

55
మూడో విజయం లోడింగ్

గాయాలు ఒకవైపు వేధిస్తున్నా, మధుశంక, కమిన్స్ వంటి నాణ్యమైన బౌలర్ల రాక సన్‌రైజర్స్‌కు కొండంత అండగా మారింది. సొంత గడ్డపై చెన్నై వంటి బలమైన జట్టును ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ మార్పులు జట్టుకు మూడో విజయాన్ని అందిస్తాయో లేదో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories