Kavya Maran Car Collection: హాట్ టాపిక్‌గా కావ్య మారన్ లగ్జరీ కార్లు.. రూ. 12 కోట్ల రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు లిస్ట్ ఇదే

Published : Nov 16, 2026, 07:06 AM IST

Kavya Maran Car Collection: అనిరుధ్‌తో పెళ్లి తర్వాత కావ్య మారన్ లగ్జరీ కార్ల కలెక్షన్ వైరల్ అవుతోంది. రూ. 12.2 కోట్ల రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫెరారీ సహా కావ్య మారన్ గ్యారేజీలో ఉన్న కార్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
కావ్య మారన్ గ్యారేజ్ చూశారా? ఒక్కో కారు ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ, సహ యజమాని కావ్య మారన్ ప్రస్తుతం తన పెళ్లితో వార్తలతో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కలిసి నవంబర్ 11న గ్రీస్‌లో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కావ్య మారన్ రాయల్ లైఫ్‌స్టైల్, ముఖ్యంగా ఆమె దగ్గర ఉన్న కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

25
రాయల్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. ఖరీదైన కార్ల క్రేజ్

సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, రియల్ లైఫ్‌లో చాలా రాయల్‌గా ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమెకు, ప్రపంచ స్థాయి లగ్జరీ, స్పోర్ట్స్ కార్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంది. ఆమె గ్యారేజ్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ బ్రాండ్లకు చెందిన అత్యంత ఖరీదైన కార్లు కొలువుదీరి ఉన్నాయి.

35
రూ. 12.2 కోట్ల రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ VIII EWB

కావ్య మారన్ కార్ కలెక్షన్‌లో అత్యంత ఖరీదైన, రాయల్ కారు 'రోల్స్ రాయిస్ ఫ్యాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్'. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ. 12.2 కోట్లు. లోపల అద్భుతమైన కంఫర్ట్, నిశ్శబ్దమైన క్యాబిన్ దీనికి ప్రత్యేకత. ఈ సూపర్ లగ్జరీ సెడాన్‌లో 6.75-లీటర్ ట్విన్-టర్బో V12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఏకంగా 571 bhp పవర్‌ను, 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

45
రెడ్ కలర్ బెంట్లీ బెంటాయ్గా EWB

ఆమె గ్యారేజ్‌లో ఉన్న మరో స్పెషల్ కారు ఎరుపు రంగు 'బెంట్లీ బెంటాయ్గా EWB' లగ్జరీ ఎస్‌యూవీ. దీని ప్రారంభ ధర దాదాపు రూ. 6 కోట్లు. ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ వెర్షన్ కావడంతో లోపల చాలా విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 542 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది.

55
స్పీడ్ కింగ్ ఫెరారీ రోమా స్పోర్ట్స్ కారు

లగ్జరీ కార్లతో పాటు కావ్య దగ్గర ఐకానిక్ రెడ్ కలర్ ఫెరారీ రోమా స్పోర్ట్స్ కారు కూడా ఉంది. దీని ధర రూ. 3.76 కోట్ల నుండి రూ. 4.5 కోట్ల మధ్య ఉంటుంది. ఇందులో 3.9-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది. ఈ కారు కేవలం 3.4 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం కలిగి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories