SA vs NZ హెడ్ టు హెడ్ రికార్డులు.. దక్షిణాఫ్రికాదే పైచేయి
టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఆశ్చర్యకరంగా, ఐదు సార్లూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది.
• 2007: క్వార్టర్ ఫైనల్లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలిచింది.
• 2009: ఉత్కంఠ పోరులో కేవలం ఒక పరుగు తేడాతో సఫారీలు విజయం సాధించారు.
• 2010: బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగులతో సౌతాఫ్రికా గెలిచింది.
• 2014: న్యూజిలాండ్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికా ఓడించింది.
• 2026 (ప్రస్తుత టోర్నీ): అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో మార్క్రామ్ సేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ గణాంకాలను చూస్తే సెమీస్‌లో దక్షిణాఫ్రికాకే విజయవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నాకౌట్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేము.