India vs England: వెస్టిండీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ సెలబ్రేషన్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు సంజూ దూరం కానున్నాడా? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి. అసలేంటి ఈ వివాదం?
వెస్టిండీస్‌ను ఉతికేశాడు.. కానీ ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు సంజూ దూరం కానున్నాడా?
టీ20 ప్రపంచకప్ 2026లో భారత స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను సెమీ-ఫైనల్‌కు చేర్చాడు. అయితే, ఈ అద్భుత విజయం తర్వాత సంజూ ప్రదర్శించిన భావోద్వేగపూరితమైన సెలబ్రేషన్ ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే హై-వోల్టేజ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు సంజూ అందుబాటులో ఉంటాడా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
26
వివాదానికి దారితీసిన సంజూ శాంసన్ సెలబ్రేషన్
వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, సంజూ శాంసన్ విన్నింగ్ బౌండరీ బాదిన వెంటనే భావోద్వేగానికి లోనయ్యాడు. గెలిచిన ఆనందంలో తన హెల్మెట్‌ను తీసి నేలకేసి విసిరేశాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
సంజూ శాంసన్ తన ప్రార్థనలో ఇస్లాం, క్రైస్తవ, హిందూ మతపరమైన సంప్రదాయాలను మేళవించి సర్వమత సమన్వయ సంకేతాన్ని ఇచ్చాడని నెటిజన్లు దీనిని "ట్రూ కేరళ స్టోరీ" అని అభివర్ణిస్తున్నారు. జియో హాట్‌స్టార్‌లో పార్థివ్ పటేల్‌తో మాట్లాడుతూ, "నేను దైవాన్ని బలంగా నమ్ముతాను. నా విశ్వాసాలను గోప్యంగా ఉంచాలనుకుంటాను. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం" అని సంజూ పేర్కొన్నాడు.
36
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ప్రార్థనలు లేదా మతపరమైన హావభావాల పట్ల ఐసీసీకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, ఇక్కడ అసలు సమస్య సంజూ హెల్మెట్‌ను నేలకేసి విసిరేయడం. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం, క్రికెట్ పరికరాలను (బ్యాట్, హెల్మెట్, స్టంప్స్) దుర్వినియోగం చేయడం లేదా వాటిని విసిరేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆగ్రహంతో చేసినా లేదా అమితమైన ఉత్సాహంతో చేసినా, పరికరాలను గౌరవించకపోవడం నేరంగా పరిగణిస్తారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఉల్లంఘనలను వివిధ స్థాయిలుగా విభజిస్తారు:
లెవల్ 1 నేరం: సాధారణంగా హెల్మెట్ విసిరేయడం వంటి చర్యలను లెవల్ 1 కింద పరిగణిస్తారు. దీనికి మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా, 1 లేదా 2 డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. దీనివల్ల మ్యాచ్ నిషేధం ఉండదు.
లెవల్ 2 నేరం: గత 24 నెలల్లో 4 డీ మెరిట్ పాయింట్లు పూర్తయినా లేదా రిఫరీ దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా భావించినా నిషేధం విధిస్తారు. ఉదాహరణకు, గతంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్టంప్స్‌ను కొట్టి అంపైర్లపై అసహనం వ్యక్తం చేసినందుకు రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఎదుర్కొన్నారు.
ఫిబ్రవరి 18న స్కాట్లాండ్ ఆటగాడు జార్జ్ మున్సే కూడా ఔట్ అయిన తర్వాత హెల్మెట్ విసిరినందుకు ఒక డెమెరిట్ పాయింట్ పొందాడు.
56
మతపరమైన హావభావాలపై ఐసీసీ వైఖరి ఏంటి?
మతపరమైన గుర్తులను గౌరవించే విషయంలో ఐసీసీ సానుకూలంగానే ఉంటుంది. ఏవైనా హావభావాలు వేరే మతాన్ని కించపరిచేలా లేదా రెచ్చగొట్టేలా ఉంటేనే అవి 'యాంటీ-రేసిజం కోడ్' కింద లెవల్ 3 లేదా 4 కిందకు వస్తాయి. సంజూ శాంసన్ చేసిన సెలబ్రేషన్ శాంతియుతంగా, కృతజ్ఞతను చాటే విధంగా ఉంది కాబట్టి దీనిపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం లేదు. కేవలం హెల్మెట్ విసిరేయడం మాత్రమే చర్చనీయాంశం.
66
సెమీ-ఫైనల్ రేసులో సంజూ ఉంటాడా?
భారత్, ఇంగ్లాండ్ మధ్య మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో రెండో సెమీ-ఫైనల్ జరగనుంది. సంజూ శాంసన్ ఇప్పటికే జట్టుతో కలిసి ముంబై చేరుకున్నాడు. ఇప్పటివరకు మ్యాచ్ రిఫరీ నుండి అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు లేదా జరిమానా ప్రకటించలేదు. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకున్నా, అది జరిమానా లేదా డెమెరిట్ పాయింట్లకే పరిమితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌లో భారత్‌కు వెన్నెముకగా ఉన్న సంజూపై నిషేధం పడితే అది టీమ్ ఇండియాకు కోలుకోలేని దెబ్బ అవుతుంది. ప్రస్తుతం భారత అభిమానులంతా సంజూ సెమీస్‌లో ఆడాలని కోరుకుంటున్నారు.