Smriti Mandhana : ఇటీవల ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా ఉమెన్స్ క్రికెటర్ల పేరు మారుమోగింది. కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ క్రమంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఉద్యోగంపై చర్చ సాగింది. ఇతకూ ఆమె ఎక్కడ ఉద్యోగం చేస్తారో తెలుసా?
Smriti Mandhana : క్రికెట్ అంటే ఇండియన్స్ పడిచస్తుంటారు... సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా భావించి పూజించే అభిమానులున్నారు ఈ దేశంలో. ధోని, కోహ్లీ, రోహిత్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వీరిస్థాయిలో క్రేజ్ కలిగిన మహిళా క్రికెటర్ల స్మృతి మంధాన. ఆమె ఆటే కాదు అందం కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది... అందుకే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ లో స్టార్ గా మారింది. అభిమానులనే కాదు బాగా డబ్బులు కూడా సంపాదించిన క్రికెటర్ స్మృతి... ఈమె కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులను కలిగివుంది.
25
స్మృతి మంధాన ఏ ఉద్యోగం చేస్తారు..?
సాధారణంగా క్రీడాకారులు కేవలం తమ ఆటతోనే కాదు ఎండార్స్ మెంట్స్, ఇతర వ్యాపారాల ద్వారా కూడా ఆదాయం పొందుతుంటారు. అంతేకాదు కొందరికి ప్రభుత్వమే పిలిచిమరీ ఉద్యోగాలిస్తుంటుంది. ఇలా ఇటీవల ఉమెన్స్ వరల్డ్ కప్ సాధించిన జట్టులోని మహిళా క్రికెటర్లు కొందరు ఉద్యోగాలు పొందారు... మరి చాలాకాలంగా స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న స్మృతి మంధాన ఏ ఉద్యోగం చేస్తారు? అనే డౌట్ చాలామందికే వచ్చివుంటుంది.
అయితే స్మృతి మంధాన క్రికెట్ లోనే కాదు ఏ విషయంలో అయినా స్టారే... ఆమె చేసే ఉద్యోగమే ఇందుకు నిదర్శనం. చిన్నాచితక ఉద్యోగం కాదు... తన స్టార్డమ్ కు తగ్గట్లుగానే ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తున్నారు మంధాన. ఇండియన్ ఉమెన్స్ కి మూలస్తంభంగా నిలిచిన స్మృతి దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన RBI లో ఉద్యోగి. ఆర్బిఐలో అసిస్టెంట్ మేనేజర్ స్ధాయి ఉద్యోగాన్ని కలిగివున్నారు స్మృతి మంధాన.
35
స్మృతి మంధాన వ్యక్తిగత జీవితం..
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీ. 1996 జులై 18న ఓ మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీనావాస్ మంధాన, తల్లి స్మితా మంధాన. మంధాన విద్యాభ్యాసమంతా సాంగ్లీలోనే సాగింది... బీకామ్ వరకు చదువుకున్నారు.
స్మృతి మంధాన తండ్రితో పాటు సోదరుడికి క్రికెట్ అంటే ఆసక్తి. దీంతో చిన్నప్పటినుండి క్రికెట్ ను చూస్తూ పెరిగిన స్మృతి దానిపై ఇష్టాన్ని పెంచుకుంది. ఆమె ఆసక్తిని గమనించిన కుటుంబంకూడా ఆ దిశగా ప్రోత్సహించారు... దీంతో తొమ్మిదేళ్ల వయసులోనే మంధాన మహారాష్ట్ర అండర్ 15 జట్లుకు ఎంపికయ్యింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు... 2013 లో భారత మహిళల జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.
స్మృతి మంధాన కేవలం క్రికెటర్ మాత్రమే కాదు అందమైన క్రికెటర్. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ... దీంతో పలు కంపెనీలు ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాయి. ఇలా ఎండార్స్ మెంట్స్ ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతోంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ వైస్ కెప్టెన్, మహిళల ప్రీమియర్ లీగ్ లో RCB కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆమె ఏటా కోట్లల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం మంధాన నికర ఆస్తుల విలువు దాదాపు 32-34 కోట్ల రూపాయల వరకు ఉంటాయని వివిధ రిపోర్టులు చెబుతున్నాయి.
55
స్మృతి మంధాన ఇంటర్నేషనల్ కెరీర్
అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లెప్ట్ హ్యాండెడ్ ఉమెన్ క్రికెటర్ పరుగులు సునామీ పారిస్తున్నారు. ఓపెనర్ గా బరిలోకి దిగే మంధాన వన్డే, టీ20 స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందారు. అతి తక్కువగా టెస్టులు ఆడారు. ఇప్పటివరకు కేవలం 7 టెస్టులు మాత్రమే ఆడిన మంధాన 629 పరుగులు చేశారు... ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
ఇక స్మృతి మంధాన వన్డే కెరీర్ అద్భుతంగా సాగుతోంది. ఆమె ఇప్పటివరకు 117 వన్డేల్లో 48.38 సగటుతో 5,322 పరుగులు చేశారు... ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే 157 టీ20 మ్యాచుల్లో 4,102 పరుగులు చేశారు... ఇందులో ఓ సెంచరీ, 32 హాఫ్ సెంచరీలున్నాయి.