Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !

Published : Dec 11, 2025, 07:01 AM IST

Smriti Mandhana : పెళ్లి రద్దయ్యాక టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తొలిసారి బయటకొచ్చింది. క్రికెట్టే తనకు ప్రాణమని, వ్యక్తిగత సమస్యలను పక్కనపెట్టి దేశం కోసం ఆడతానని అన్నారు.

PREV
15
స్మృతి మంధాన ఎమోషనల్ కామెంట్స్

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి రద్దు ప్రకటన తర్వాత తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ఆమె వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల అది రద్దయిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఆమె తొలిసారి ఢిల్లీలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

25
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మౌనంగా స్మృతి మంధాన..

వివాహం రద్దయినట్లు ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత స్మృతి మంధాన ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. ఆమెను చూడగానే ఫోటోలు తీయడానికి పాపరాజీలు పోటీపడ్డారు. అయితే, స్మృతి చాలా ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరించారు. ముఖానికి మాస్క్ ధరించి, మీడియాతో మాట్లాడకుండా నేరుగా తన కారు వైపు వెళ్లిపోయారు. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఢిల్లీ చేరుకున్నారు.

35
స్మృతి మంధాన వివాహం రద్దు.. అసలేం జరిగిందంటే?

మహిళల వరల్డ్ కప్ 2025 గెలిచిన కొన్ని రోజులకే స్మృతి మంధాన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు రావాల్సి ఉంది. నవంబర్ 23 (ఆదివారం) నాడు పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ, పెళ్లి రోజున స్మృతి తండ్రి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరూ పరస్పర అంగీకారంతో పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ, "గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ని. పెళ్లి రద్దయిందని స్పష్టం చేస్తున్నాను. దయచేసి మా రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించండి" అని స్మృతి కోరారు. దేశం కోసం ఆడటమే తనకు ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

45
క్రికెట్టే నా ప్రాణం: స్మృతి మంధాన

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి మంధాన, తన జీవితంలో క్రికెట్ కంటే ఏదీ ఎక్కువ కాదని భావోద్వేగంతో చెప్పారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మనసులో ఇతర ఆలోచనలు ఉండవని అన్నారు.

"నిజం చెప్పాలంటే, జీవితంలో క్రికెట్ కంటే నేను దేనినీ ఎక్కువగా ప్రేమించను. బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు లేదా దేశం కోసం మైదానంలోకి దిగినప్పుడు, మనసులో ఎలాంటి ఇతర ఆలోచనలు ఉండవు. భారత జెర్సీని ధరించినప్పుడు, దేశం కోసం మ్యాచ్ గెలవాలనే కోరిక మాత్రమే ఉంటుంది. జెర్సీ వేసుకోగానే మన సమస్యలన్నీ పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నామనే బాధ్యత మనపై ఉంటుంది" అని స్మృతి అన్నారు.

55
భారత జట్టులో విభేదాలపై స్మృతి మంధాన క్లారిటీ

భారత జట్టులో ఉండే విభేదాలపై కూడా స్మృతి మంధాన స్పందించారు. జట్టు సభ్యుల మధ్య వాదనలు జరగడం సహజమనీ, అది గెలవాలనే కసికి నిదర్శనమని ఆమె అన్నారు.

"నేను వాటిని సమస్యలుగా చూడను. ఎందుకంటే అందరూ దేశం కోసం గెలవాలనే కోరుకుంటారు. గెలవడానికి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే, మా మధ్య చర్చలు లేదా వాదనలు లేకపోతే, మేము మైదానంలో గెలవలేము. ఏదైనా విషయంపై విభేదిస్తున్నామంటే, మ్యాచ్ గెలవడానికి మాకు తగినంత ప్యాషన్ ఉందని అర్థం" అని స్మృతి మంధాన స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories