Shreyas Iyer శ్రేయస్ అయ్యర్ కి పిచ్చ కోపం.. కెప్టెన్ నేనా, అతనా? అంటూ అంపైర్‌పై గరం!

మైదానంలో ఎప్పడూ కూల్ గా ఉండే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో థర్డ్ అంపైర్ సమీక్ష కోరే సందర్భంలో కెప్టెన్ అయిన తనను సంప్రదించకపోవడంపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. అసలు అయ్యర్ కోపానికి కారణం ఏంటో తెలుసా?

Shreyas iyer umpire clash over DRS call in PBKS vs SRH match in telugu
ఘటన వైరల్

ఐపీఎల్ సిరీస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, పంజాబ్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 245 రన్స్ చేసింది. భారీ  లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 247 రన్స్ చేసి గెలిచింది. మ్యాచ్ 2వ ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ అంపైర్‌తో గొడవపడ్డ ఘటన వైరల్ అయింది.

Shreyas iyer umpire clash over DRS call in PBKS vs SRH match in telugu
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బాల్‌లో 82 రన్స్ కొట్టి అదరగొట్టాడు. అంటే పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్ చేసిన ఇన్నింగ్స్‌లోని ఐదవ ఓవర్ యొక్క రెండవ బాల్‌ను అంపైర్ వైడ్ బాల్ అని తీర్పు ఇచ్చారు. కానీ బాల్ కాలికి టచ్ అయింది అనేది మ్యాక్స్‌వెల్ వాదన. అందుకే మ్యాక్స్‌వెల్ అంపైర్ తో చెప్పి డీఆర్‌ఎస్ అభ్యర్థించాడు.  కానీ డీఆర్‌ఎస్  అభ్యర్థించే ముందు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ని సంప్రదించలేదు.  తానే నిర్ణయం తీసుకున్నారు. అంపైర్ దానిని ఒప్పుకొని, డీఆర్‌ఎస్ అప్పీల్ ఇచ్చారు . దీంతో ఆగ్రహానికి గురైన శ్రేయస్ అయ్యర్ 'అంపైర్.. నేను కదా జట్టు కెప్టెన్ ని.. అతడు కాదు..  ఒక్కసారైనా నన్ను అడగాలిగా’ అంటూ హిందీలో అరిచాడు.


SRH vs PBKS

శ్రేయస్ అంపైర్‌తో గొడవపడే వీడియో అంతర్జాలంలో వైరల్ అయింది. చివరికి డీఆర్‌ఎస్ రిజల్ట్‌లో అది వైడ్ బాల్ కాదు అని తెలిసింది. సాధారణంగా జట్టు కెప్టెన్‌లు డీఆర్‌ఎస్ తీసుకుంటారు. దానినే అంపైర్ అధికారికంగా ఒప్పుకుంటారు. కానీ నిన్న మ్యాక్స్‌వెల్ తనంతట తాను డీఆర్‌ఎస్ అడగడం, ఎంపైర్ ఆమోదించడం శ్రేయస్ కి ఏమాత్రం నచ్చలేదు. మ్యాక్స్‌వెల్ దగ్గర ఆ కోపం చూపించకుండా అంపైర్ పై అరిచాడు.


ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ''శ్రేయస్ అయ్యర్ గొడవపడింది కరెక్టే. వారి పర్మిషన్ లేకుండా మ్యాక్స్‌వెల్ డీఆర్‌ఎస్ అడగడం తప్పు. అంపైర్ కూడా శ్రేయస్ అయ్యర్‌ని చూడాల్సింది'' అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇంకొందరు, ''ఇది వైడ్ బాల్ కాదు అని క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే మ్యాక్స్‌వెల్ డీఆర్‌ఎస్ అడిగినా, అంపైర్ దానిని ఒప్పుకున్నా ఏం తప్పు ఉంది? 'శ్రేయస్ అయ్యర్ మెచ్యూరిటీ పెంచుకోవాలి. ఇక్కడనే ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వేరుగా నిలుస్తారు'' అని చెప్పారు.

Latest Videos

vuukle one pixel image
click me!