భలే సుడిగాడివిరా మావ.! ఇషాన్‌ కంటే శాంసన్‌ వికెట్ కీపింగ్‌కు బెస్ట్..

Published : Feb 03, 2026, 05:59 PM IST

Sanju Samson: 2026 టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా వికెట్ కీపర్ స్థానంపై ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్‌లో ఇషాన్ రాణించినా, కీలక మ్యాచ్‌లలో కీపింగ్ లోపాలు అతనికి ప్రతికూలంగా మారాయి.  

PREV
15
టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం

2026 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో టీం మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడింది.

25
సుమారు రెండేళ్ల తర్వాత

సుమారు రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్, న్యూజిలాండ్ పై సెంచరీతో సహా 215 పరుగులు చేసి బ్యాటింగ్‌లో తన సత్తాను చాటుకున్నాడు. మరోవైపు సంజూ శాంసన్ వరుస వైఫల్యాలతో కేవలం 46 పరుగులకే పరిమితమయ్యాడు.

35
ఇషాన్ కిషన్ కీపింగ్ లోపాలు

అయితే, తిరువనంతపురం మ్యాచ్ లో ఇషాన్ కిషన్ కీపింగ్ లోపాలు బయటపడటం సంజూ శాంసన్ కు కలిసొచ్చింది. బ్యాటింగ్ లో రాణించినప్పటికీ.. వికెట్ కీపింగ్ చేయడంలో తడబడ్డాడు.

45
ఇషాన్ వికెట్ల వెనుక..

ఇషాన్ వికెట్ల వెనుక రెండు కీలక స్టంపింగ్ అవకాశాలను చేజార్చుకోవడమే కాకుండా బైస్ రూపంలో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. ఇది సంజూకు కలిసొచ్చే అంశం.

55
మెగా టోర్నీలో కీపింగ్ నైపుణ్యం..

మెగా టోర్నీలో కీపింగ్ నైపుణ్యం అత్యంత కీలకం కావడంతో ఇషాన్ తడబాటు టీం మేనేజ్‌మెంట్ ను పునరాలోచనలో పడేసింది. కేవలం బ్యాటర్ గా ఇషాన్ ను ఆడించే అవకాశం లేకపోవడంతో, వికెట్ల వెనుక మంచి ప్రదర్శన కనబరిచే సంజూ శాంసన్ తన స్థానాన్ని కాపాడుకునే అవకాశాలు మెరుగపడ్డాయి. ఈ పరిణామం సంజూ కెరీర్ కు కొత్త ఊపిరి పోసింది.

Read more Photos on
click me!

Recommended Stories