Sanju Samson: న్యూజిలాండ్‌పై రికార్డు రన్ ఛేజ్ తో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలోనే మ్యాచ్‌పై పట్టు సాధించాలనే అటాకింగ్ స్ట్రాటజీని బయటపెట్టారు.
సంజూ శాంసన్ కామెంట్స్.. టీమిండియా కొత్త అటాకింగ్ ఫార్ములా
క్రైస్ట్‌చర్చ్ లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ చరిత్రాత్మక రన్ ఛేజ్‌తో ఘనవిజయం సాధించింది. ఈ రికార్డు విజయం అనంతరం భారత స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన సంజూ, మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీమిండియా కొత్త మైండ్‌సెట్, మైండ్ గేమ్‌ను స్పష్టం చేశారు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు అనుసరిస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు.
25
పవర్ ప్లేలోనే గేమ్‌ను ముగించేస్తాం.. సంజూ శాంసన్
ఛేజింగ్ సమయంలో టార్గెట్ చిన్నదైనా, పెద్దదైనా తమ వ్యూహంలో మార్పు ఉండదని సంజూ వ్యాఖ్యానించారు. "మా ప్రణాళికలు ప్రతి దశకూ వేర్వేరుగా ఉంటాయి. పవర్ ప్లే ఒకలా ఉంటే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్ల వ్యూహాలు వేరేలా ఉంటాయి. లక్ష్యం 170 పరుగులైనా సరే, పవర్ ప్లేలో మంచి ఆరంభం లభిస్తే ఆ మొదటి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌పై ప్రత్యర్థికి ఆశలు లేకుండా చేస్తాం. అంటే పవర్ ప్లేలోనే గేమ్‌ను కిల్ చేయడమే మా స్టైల్" అని సంజూ స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఈ విధానం ఫలించకపోయినా, ఈ అటాకింగ్ మైండ్‌సెట్‌నే కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
35
బిజీ షెడ్యూల్.. ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు
భారత జట్టు బిజీ షెడ్యూల్‌పై వస్తున్న వార్తలపై కూడా సంజూ శాంసన్ స్పందించారు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే మేనేజ్మెంట్ ఫిట్‌నెస్‌కు సంబంధించి కఠినమైన ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. "వరుస మ్యాచ్‌లు ఆడటం మాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాం. ఫిట్నెస్ రొటీన్‌ను పక్కాగా పాటించడం వల్ల ఫిజికల్‌గా, మెంటల్‌గా మేమంతా చాలా మంచి స్థితిలో ఉన్నాం. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, భారీ హోటళ్లలో వసతి పొందుతున్నాం కాబట్టి షెడ్యూల్ గురించి ఫిర్యాదు చేయాల్సిన పనే లేదు" అని సంజూ వివరించారు.
వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడిన ఇన్నింగ్స్‌లు తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచాయని సంజూ తెలిపారు. దేశం కోసం ఆడుతూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం వల్ల మానసికంగా ఎంతో దృఢంగా మారతానని చెప్పారు. ఆ నమ్మకంతోనే క్రీజులోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో సంజూ కేవలం 33 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి భారత్ రికార్డు ఛేదనకు గట్టి పునాది వేశారు. ఈ ప్రదర్శనతో ఈ ఏడాది 26 ఇన్నింగ్స్‌లలో సంజూ తన 8వ ఫిఫ్టీ ప్లస్ స్కోరును నమోదు చేయడం విశేషం.
55
రికార్డు ఛేదనతో శ్రేయస్, నమన్ మెరుపులు
న్యూజిలాండ్ ఉంచిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 230/6 స్కోరు చేసి ఛేదించింది. సంజూ వేగవంతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ, మిడిల్ ఓవర్లలో కివీస్ స్పిన్నర్లు శాంట్నర్, బ్రేస్‌వెల్ వరుస వికెట్లు తీసి ఇబ్బంది పెట్టారు. అయితే చివరి ఓవర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42), నమన్ ధీర్ (15 బంతుల్లో 42 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 శనివారం హగ్లీ ఓవల్‌లో జరగనుంది.