Salman Ali Agha: పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టీ20 వరల్డ్ కప్‌పైనే తమ దృష్టి ఉంటుందని.. బయట జరుగుతున్న వివాదాలను తాము పట్టించుకోమని చెప్పాడు. తమ దృష్టి అంతా ఆటపైనే ఉంటుంది.. ప్రత్యేకంగా భారత్‌ను బహిష్కరించిన నిర్ణయం..
మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2026 మొదలైంది. ఏప్రిల్ 7 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కాగా.. పాకిస్తాన్ జట్టు తన తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న ఆడనుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. బయట జరుగుతున్న వివాదాలను తాము పట్టించుకోమని.. తమ దృష్టి అంతా మైదానంలో గెలుపుపై ఉంటుందని స్పష్టం చేశాడు. పాక్ జట్టు వివాదాల కంటే ఆటపైనే దృష్టి పెడుతుందని.. తమ ఆటగాళ్లు అందరూ మైదానంలో అద్భుతంగా ఆడతారని తెలిపాడు.
25
భారత్ మ్యాచ్ బహిష్కరణ..
ఫిబ్రవరి 15న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ జట్టు రెండు పాయింట్లు కోల్పోతుంది. దీంతో గ్రూప్ దశలో జరిగే మిగిలిన మూడు మ్యాచ్‌లు పాక్ జట్టు కచ్చితంగా గెలవాల్సిందే. ఈ క్రమంలోనే జట్టు దృష్టి మొత్తం ఆటపైనే ఉండాలని కెప్టెన్ సల్మాన్ అంటున్నాడు.
35
ఇదొక కెప్టెన్సీ వ్యుహమా..
సల్మాన్ మాట్లాడుతూ 'మేము రోల్ మోడల్స్ లాంటివాళ్లం' అని అన్నాడు. తాము ఎలా ఉంటామో.. అదే అభిమానులు కూడా చేస్తారు. మా ప్రవర్తన వారిపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే వివాదాలను పట్టించుకోకుండా ఆటపై ధ్యాస పెట్టాలని చెప్పాడు. క్రికెటర్లు ఫోకస్ తప్పితే ఆటపై ప్రభావం పడుతుంది. భారత్ మ్యాచ్ బహిష్కరణపై మాట్లాడుతూ.. ఇలాంటి వివాదాలు క్రికెట్ కోణంలో మంచివి కాదని స్పష్టం చేశాడు. జట్టు ప్రదర్శనే తన ఫోకస్ అని చెప్పుకొచ్చాడు.
భారత్‌తో మ్యాచ్ లేకపోవడం వల్ల పాకిస్థాన్ జట్టుకు గ్రూప్‌లో మిగిలిన మూడు మ్యాచ్‌లు కీలకమే. నెదర్లాండ్స్, యూఎస్ఏ, నమీబియా జట్లతో పోరాడాల్సిందే. ఈ మూడు మ్యాచ్‌లే లీగ్ స్టేజ్‌లో పాకిస్తాన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. 'ప్రతి మ్యాచ్‌లో బెస్ట్ ఇస్తాం. ఓటముల నుంచి నేర్చుకుని ముందు వెళ్తాం' అని సల్మాన్ అన్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ శ్రద్ధ అవసరం అని.. అదే జట్టుకు విజయాన్ని తెచ్చిపెడుతుందన్నాడు.
55
వర్షం పడే ఛాన్స్..
కొలంబోలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వరుణుడు పాక్ జట్టుకు అడ్డంకిగా మారొచ్చు. దీనిపై మాట్లాడుతూ.. వాతావరణం మన నియంత్రణలో లేదు. ఆటపై దృష్టి పెట్టడమే మన పని. వాతావరణ విషయాలు ఆటపై ప్రభావం పడకుండా ముందుకు సాగాలని కెప్టెన్ సల్మాన్ ఆఘా అన్నాడు.