అర్జున్‌ టెండూల్కర్‌ నిశ్చితార్థం జరిగిందా ? క్లారిటీ ఇచ్చిన సచిన్

Published : Aug 26, 2025, 09:16 AM IST

Arjun Tendulkar Engagement: అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

PREV
16
అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందా?

Arjun Tendulkar: సెలబ్రిటీ లైఫ్ అంటే మిరాకిల్ కాదు. ఫ్యాన్స్, మీడియా, సోషల్ మీడియా వల్ల వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా ఇట్టే బహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక నిశ్చితార్థాలు, వివాహాలు, ఇతర వ్యక్తిగత వ్యవహరాలతై ఇట్టే ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయి. అలాగే.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయంపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా స్పందించారు. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే? 

26
సచిన్ క్లారిటీ..

అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు అసలు నిజం తెలుసుకోవాలని ఆసక్తిగా ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురుచూశారు. ఈ ఊహాగానాలకు తెరపడింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ‘Ask Me Anything’ సెషన్‌లో ఈ వార్తపై వివరణ ఇచ్చారు. అర్జున్‌కు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. సచిన్ సమాధామిస్తూ, “అవును, అర్జున్‌కు నిజంగానే నిశ్చితార్థం జరిగింది. అతని జీవితంలో ఈ కొత్త అధ్యాయంపై మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.” అని పేర్కొన్నారు.

36
నిశ్చితార్థం ఎప్పుడు జరిగిందంటే?

మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే? అర్జున్ టెండూల్కర్ , సానియా చందోక్ నిశ్చితార్థం ఈ నెల 14న జరిపినట్లు సమాచారం. ఈ వేడుక ముంబైలో ఇరు కుటుంబాల అత్యంత సన్నిహిత సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే అప్పటిదాకా ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలూ రాలేదు, కానీ సచిన్ చేసిన ధృవీకరణతో ఇది అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

46
సానియా చందోక్ ఎవరు?

అర్జున్ కాబోయే భార్య సానియా చందోక్గురించి కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సానియా ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఘాయ్ కుటుంబం హాస్పిటాలిటీ, ఫుడ్ రంగాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించింది. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి సంస్థలు వారి కుటుంబానికి చెందిన ప్రముఖ బ్రాండ్లు. సానియా ప్రొఫెషనల్, కల్చరల్ పరంగా క్రికెట్ ఫ్యామిలీకి సరిగ్గా సరిపోతుందనే అభిమానుల అభిప్రాయం పడుతున్నారు.

56
అర్జున్ టెండూల్కర్ కెరీర్:

అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్‌గా అతను గోవా తరఫున దేశస్థాయి క్రికెట్ మ్యాచ్‌లలో పాల్గొంటున్నాడు. అర్జున్ తన స్వీడ్ అండ్ లైన్-లెంగ్త్, స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో తన ప్రతిభ చూపిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. 

తండ్రి సచిన్ టెండూల్కర్ మార్గదర్శకత్వంలో అర్జున్ తన టెక్నిక్, ఫిట్‌నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ఐపీఎల్, రాష్ట్రీయ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో ప్రదర్శించిన ప్రదర్శనలు అతని కెరీర్‌లో కీలక మలుపులుగా నిలుస్తున్నాయి.

66
అభిమానుల స్పందన:

నిశ్చితార్థ వార్త బయటపడిన వెంటనే సోషల్ మీడియాలో జోష్, శుభాకాంక్షల వర్షం వెల్లువెత్తింది. సచిన్ ఫ్యాన్స్ అర్జున్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “జీవితంలో కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు!” అంటూ సందేశాలు పంపుతున్నారు. టెండూల్కర్ కుటుంబం కూడా ఆనందోత్సాహంలో మునిగింది. అర్జున్ జీవితంలో ప్రారంభమైన కొత్త అధ్యాయం క్రికెట్ ప్రపంచానికి మధుర క్షణంగా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories