ఏం ఫీల్ మావ.! కోచ్‌గా గంభీర్ అవుట్.. అప్పుడే టెస్టుల్లోకి కోహ్లీ కంబ్యాక్.?

Published : Jan 04, 2026, 02:57 PM IST

Virat Kohli: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ 2026లో టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది జరగాలంటే గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ పదవి నుంచి తప్పుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

PREV
15
కింగ్ కోహ్లీ టెస్టుల్లోకి..

క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విరాట్ కోహ్లీని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. ఈ టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావడం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2026లో కోహ్లీ తిరిగి టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, విరాట్ పునరాగమనం వెనుక ఒక 'మ్యాజిక్' జరగాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

25
గంభీర్‌ను తప్పిస్తే..

గంభీర్ కోచ్‌గా తప్పుకున్న తర్వాతే కింగ్ కోహ్లీ ఈ ఫార్మాట్‌లోకి తిరిగి రావచ్చని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్‌లో వైఫల్యాల పరంపర కారణంగా ఆయనను కోచ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతోంది. ఈ పరిణామం చోటుచేసుకుంటే విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టులోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

35
కీలక వ్యాఖ్యలు..

విరాట్ కోహ్లీ పునరాగమనంపై ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సంవత్సరం విరాట్ తిరిగి జట్టులోకి రావచ్చని పేర్కొన్నాడు. అయితే ఇది జరగాలంటే గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ పదవి నుంచి నిష్క్రమించడం తప్పనిసరి అని స్పష్టం చేశాడు. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ మధ్య సత్సంబంధాలు లేవని, వారు మాట్లాడుకోవడం లేదనిపిస్తోందని అన్నాడు.

45
గతేడాది టెస్టుల్లో రిటైర్మెంట్..

గత ఏడాది మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం విరాట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రియులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. కోహ్లీ రిటైర్మెంట్‌పై ఇప్పటికీ పలు అనుమానాలు నెలకొని ఉన్నాయి. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్‌ చూస్తే.. 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో సహా మొత్తం 9230 పరుగులు చేశాడు.

55
రీ-ఎంట్రీ ఇస్తే..

ఇప్పుడు గనుక విరాట్ తిరిగి ఈ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తే, అతడు టెస్ట్ ఫార్మాట్‌లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోగలడని అంచనా. విరాట్ కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీని ధరించి టెస్ట్ క్రికెట్ పిచ్‌పై సందడి చేస్తాడో లేదో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories