ఇటీవల విడుదలైన ఫోటోలో, రితికా అహాన్‌ను ఎత్తుకుని ఉన్నారు. పక్కనే అహాన్ సోదరి సమీరా కూర్చుని ఉంది. తమ్ముడితో సమీరా ఆడుకుంటూ సంతోషంగా ఉండటం అందులో చూడవచ్చు. 2024 నవంబర్ 15న అహాన్ జన్మించాడు. అప్పటి వరకు అహాన్ ఫోటోను రోహిత్, రితికా దంపతులు విడుదల చేయలేదు. బహిరంగ ప్రదేశాలకు కూడా తీసుకెళ్లలేదు. ఈ విషయంలో రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతులు చాలా జాగ్రత్తగా ఉన్నారు.