ఇది కదా ఎగిరిగంతేసే వార్త అంటే.! టీ20ల్లోకి హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ

Published : Dec 06, 2025, 03:55 PM IST

Rohit Sharma: టీం ఇండియా స్టార్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడనున్నాడు. తన స్వంత జట్టు ముంబై తరఫున నాకౌట్ మ్యాచుల్లో హిట్ మ్యాన్ బరిలోకి దిగనున్నాడు.

PREV
15
కంబ్యాక్ న్యూస్..

టీం ఇండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ ముగిసిన తర్వాత దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాలని హిట్ మ్యాన్ నిర్ణయించుకున్నాడు.

25
స్టార్ బ్యాటర్ రీ-ఎంట్రీ

తన దేశవాళీ జట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో నాకౌట్ మ్యాచుల్లో బరిలోకి దిగేందుకు రోహిత్ శర్మ సమ్మతం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వార్త రోహిత్ శర్మ అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్త. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. నాలుగు వరుస విజయాలతో ముంబై జట్టు ఇప్పటికే నాకౌట్స్ కు చేరువైంది.

35
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ముంబై

ఈ టోర్నీలో ముంబై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉంది. గత సీజన్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ముంబై జట్టు టైటిల్ ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ముంబై జట్టు స్టార్ క్రికెటర్లతో పటిష్టంగా ఉంది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అజింక్యా రహానే, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ లాంటి టీం ఇండియా స్టార్లు ఈ జట్టులో ఉన్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఈ జట్టుతో చేరడంతో ముంబైని ఆపడం దాదాపుగా అసాధ్యమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

45
ముంబైకి జోరు..

ఈ సీజన్ లో ముంబై ఆటగాళ్ళంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. కుర్ర ఓపెనర్ ఆయుష్ మాత్రే వరుసగా రెండు సెంచరీలు బాది మంచి జోష్ లో ఉండగా, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇటీవల ఓ మెరుపు సెంచరీ చేశాడు. అలాగే, పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శనతో జట్టుకు కీలకంగా మారాడు.

55
వన్డేల్లో సూపర్ ఫామ్

ఇదిలా ఉంటే, అంతర్జాతీయ టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ, 38 ఏళ్ళ లేటు వయసులోనూ ఈ ఫార్మాట్ లో అద్భుతంగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ, హాఫ్ సెంచరీతో దుమ్ము రేపిన హిట్ మ్యాన్, ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో ఓ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు.

Read more Photos on
click me!

Recommended Stories