విరాట్ కోహ్లీకి షాక్.. రోహిత్ శర్మ రికార్డ్ బ్లాస్ట్ !

Published : Oct 23, 2025, 02:20 PM IST

Rohit Sharma Breaks Kohli Record : రోహిత్ శర్మ ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ తరఫున వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, సౌరవ్ గంగూలీని దాటి భారత మూడవ అత్యధిక రన్స్‌ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీని కూడా బీట్ చేశాడు.

PREV
15
రోహిత్ శర్మ కొత్త చరిత్ర

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో సెన్సేషనల్‌ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆయన కొత్త రికార్డు నెలకొల్పాడు. అడిలైడ్‌ ఓవల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్ సెంచరీ నాక్ ఆడాడు.

భారత్, ఆస్ట్రేలియా వన్డేల్లో కంగారు గడ్డపై 1000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఈ ఘనతను ఆయన 21వ వన్డేలో సాధించాడు. మ్యాచ్‌ మూడో ఓవర్‌లో మిచెల్‌ స్టార్క్ వేసిన ఐదో బంతిని ఫోర్‌గా కొట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు.

25
కోహ్లీని బీట్ చేసిన రోహిత్ శర్మ

ఈ మైలురాయి కోసం విరాట్ కోహ్లీ కూడా పోటీ పడ్డాడు. కానీ, రోహిత్ ముందంజలో నిలిచాడు. ప్రస్తుతానికి రోహిత్‌ 21 మ్యాచ్‌లలో 1003 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన సగటు 55.77 కాగా, నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 171. ఆయన ఇప్పటివరకు 76 ఫోర్లు, 29 సిక్సర్లు బాదాడు.

కోహ్లీ 20 మ్యాచ్‌లలో 802 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన సగటు 44.55, మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 117 పరుగులు.

35
భారత దిగ్గజాలకు సాధ్యం కాలేదు

భారత క్రికెట్ దిగ్గజాలు ఎవరూ సాధించని ఈ రికార్డును రోహిత్ అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌ 25 మ్యాచ్‌లలో 740 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 30.83. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు.

ఎంఎస్ ధోనీ 21 మ్యాచ్‌లలో 684 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 45.60. ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 87* పరుగులు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ 11 మ్యాచ్‌లలోనే 683 పరుగులు సాధించాడు. సగటు 68.30. నాలుగు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఆరోన్ ఫించ్ 665, డేవిడ్ బూన్ 646, అలెన్ బోర్డర్ 595, డేవిడ్ వార్నర్ 543, మాథ్యూ హెడెన్ 534 పరుగులతో ఉన్నారు.

45
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా రోహిత్

రెండో వన్డేలో రోహిత్ మరో రికార్డును కూడా సాధించాడు. సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించి, భారత వన్డే చరిత్రలో మూడవ అత్యధిక రన్స్‌ స్కోరర్‌గా నిలిచాడు.

గంగూలీ 1992 నుంచి 2007 వరకు 308 వన్డేలు ఆడి 11,221 పరుగులు చేశాడు. రోహిత్‌ 275వ వన్డేలో 46 పరుగులు చేయడంతో గంగూలీని దాటాడు. ఆడమ్‌ జాంపా బౌలింగ్‌లో 21వ ఓవర్‌ ఐదో బంతిని ఫోర్‌ కొట్టి ఈ రికార్డును సాధించాడు.

ప్రస్తుతం రోహిత్‌ 11,225 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆయన కంటే ముందు సచిన్ టెండూల్కర్‌ (18,426 పరుగులు), విరాట్ కోహ్లీ (14,181 పరుగులు) మాత్రమే ఉన్నారు.

55
ఓపెనర్‌గా గంగూలీని అధిగమించిన రోహిత్

వన్డేల్లో అత్యధిక రన్స్ సాధించిన టాప్ 5 భారత ఆటగాళ్లు

  1. సచిన్ టెండూల్కర్ 18,426
  2. విరాట్ కోహ్లీ 14,181
  3. రోహిత్ శర్మ 11,225*
  4. సౌరవ్ గంగూలీ 11,221
  5. రాహుల్ ద్రావిడ్ 10,768

ఓపెనర్‌గా భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. ఆయన 9,146 పరుగులు సాధించాడు. కానీ రోహిత్‌ ఈ రెండో వన్డే తొలి ఓవర్‌లోనే ఒక పరుగుతో ఆ రికార్డును అధిగమించాడు.

38 ఏళ్ల రోహిత్‌ ప్రస్తుతం భారత వన్డే చరిత్రలో అత్యంత స్థిరమైన బ్యాట్స్‌మన్‌లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన రికార్డులు ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశాయి.

Read more Photos on
click me!

Recommended Stories